https://oktelugu.com/

MLC Election Notification: తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికలకు షెడ్యూల్‌.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎన్నంటే..!?

తెలంగాణలో ప్రస్తుతం ఒక పట్టభద్రులు, రెండు టీచర్‌ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరుగనుంది. మార్చి 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ క్రమంలో ఎన్నిక సంఘం మరో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది.

Written By: , Updated On : February 24, 2025 / 03:29 PM IST
MLC Election Notification

MLC Election Notification

Follow us on

MLC Election Notification: తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్‌(AndhraPradesh)లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్సీ(MLC) స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమైంది. ఈమేరకు షెడ్యూల్‌ ప్రకటించింది. మార్చి 3న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. మార్చి 20న ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న స్క్రూటినీ, 13 వరకు ఉప సంహరణకు అవకాశం ఉంటుంది.

మార్చి 29తో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు..
తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29 ఖాళీ కానున్నాయి. ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, డి.రామారావు, పి.అశోక్‌బాబు, తిరుమలనాయుడు పదవీకాలం ముగుస్తుంది. తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతిరాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, యగ్గె మల్లేశం, మీరా రియాజుల్‌ హుస్సేన్‌ పదవీకాలం పూర్తవుతుంది.

ప్రస్తుత బలాబలాలు..
తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం.. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌(Congress) పార్టీకి, ఒకటి బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎంఐఎం స్థానం ఖాళీ అవుతుండడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు ఒక స్థానం కేటాయిస్తే, కాంగ్రెస్‌కు మూడు స్థానాలు దక్కుతాయి. ఇక ఏపీలో అధికార టీడీపీ–జనసేన–బీజేపీ(TDP-Janasena-BJP) కూటమికే ఐదు స్థానాలు దక్కనున్నాయి. ఈసారి జనసేన నేత నాగబాబు(Nagababu)కు ఎమ్మెల్సీ టికెట్‌ ఇస్తామని టీడీపీ గతంలోనే ప్రకటించింది. ఎమ్మెల్సీగా చేసి కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తామని పేర్కొంది. మిగిలిన నాలుగు స్థానాల్లో బీజేపీకి ఇస్తుందా లేదా అనేది స్పష్టత లేదు.