HomeతెలంగాణKadiyam Srihari Bumper offer: కాంగ్రెస్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే 25 లక్షలు ఇస్తా.. ఓపెన్...

Kadiyam Srihari Bumper offer: కాంగ్రెస్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే 25 లక్షలు ఇస్తా.. ఓపెన్ ఆఫర్

Kadiyam Srihari Bumper offer: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో నవంబర్‌ 25న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవం చేయడంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకం ఇస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. తాజాగా స్టేషన్‌ ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు..
తన నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీం చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అయితే ఏకగ్రీవం అయ్యే సర్పంచ్‌ కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి అయి ఉండాలని కండీషన్‌ పెటారు. ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తే.. తాను మరో రూ.15 లక్షలు ఇస్తానని ప్రకటించారు. మొత్తం రూ.25 లక్షలు వస్తాయని తెలిపారు. మొత్తం గ్రామాభివృద్ధికి వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నిధులను తన ఎమ్మెల్యే ఫండ్, తన కూతురు ఎంపీ ఫండ్‌ నుంచి ఇస్తానని ప్రకటించారు.

భిన్నాభిప్రాయాలు..
కడియం ఆఫర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇది ప్రలోభ పెట్టడమే అని పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం కూడా రూ.10 లక్షలు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా ఎన్నికల ఖర్చు తగుగ్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇక తాజాగా కడియం సొంతంగా రూ.15 లక్షలు ప్రకటిచడం ప్రలోబపెట్డమే అని మండిపడుతున్నారు. గ్రామాల్లో మాత్రం ఈ ఆఫర్‌ బాగుందని చర్చించుకుంటున్నారు.

అంత ఈజా కాదు..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా గ్రామీణుల్లో ఎక్కువగా కోపంగా ఉన్నారు. దీంతో ఎన్నికలకు వెళిలే గెలుపు అంత ఈజీ కాదని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే ఏకగ్రీవంవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థులనే ఎన్నుకోవాలని కండీషన్‌ పెట్టడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు వచ్చిన ఆఫర్‌ను వినియోగించుకుందాం అని భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version