https://oktelugu.com/

Manchu Laxmi : మంచు లక్ష్మికి సర్కారు స్కూళ్లపై ఎందుకు ఇంత ప్రేమ..?

Manchu Laxmi : తన తాత, తండ్రి ఇలాంటి సర్కారు బడుల్లో చదువుకొని పైకి వచ్చారని చెప్పారు. వారి పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చింది. మీరు బాగా చదువుకుంటేనే లక్ష్యాన్ని సాధిస్తారని విద్యార్థులను ఎంకరేజ్ చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2024 / 06:21 PM IST

    Manchu Laxmi

    Follow us on

    Manchu Laxmi : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అందరికీ సుపరిచితుడే.. తెలియని వారు ఉండరు.. అతని కూతురు సినీనటి మంచు లక్ష్మిని గుర్తుపట్టని వారు ఉండరు. ఆమె సామాజిక సేవలో భాగస్వాములు అయ్యారు. డిఫరెంట్ రంగాన్ని ఎంపిక చేసుకుని ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందుతున్నది. ఆమె టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపక చైర్ పర్సన్, మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఐదో తరగతి చదువుతున్న తన కూతురు ఎలాగైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నదో.. అదే విధంగా పేద పిల్లలు చదువుకోవాలన్న సంకల్పంతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ద్వారా పేద విద్యార్థులు చదువుకుంటున్న సర్కారు బడుల్లో స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నది.

    హైదరాబాద్ నగరంలోని కార్పొరేటర్ స్కూల్లలో సాగుతున్న విద్యా బోధన గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పేద పిల్లలకు అందాలనే ఉద్దేశంతో స్మార్ట్ తరగతి గదుల ఏర్పాటుకు నడుం బిగించింది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. పెద్ద పెద్ద నగరాలను కాకుండా ఆమె కరీంనగర్ జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకున్నది. ఇందులో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయనుంది. కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. మంచి పాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బాధ్యతలు నిర్వహిస్తున్నందుకే.. ఈ విషయం ఆమె స్వయంగా స్పష్టం చేసింది.

    మంగళవారం కరీంనగర్ లోని కోతిరాంపూర్ పోచంపల్లి ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ తరగతి గదిని సినీనటి మంచు లక్ష్మి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ పమేలా సత్పతి మంచి అధికారి అని, నిత్యం తాను ఆమెను ఫాలో అవుతానని చెప్పారు. కత్తి మీద సాము లాంటి ఉద్యోగంలో పనిచేయడం ఆషామాషే విషయం కాదని చెప్పింది. ఆమె ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని పేర్కొన్నది. నాకు మంచి స్నేహితురాలు అని, గతంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో 50 స్కూళ్లను అభివృద్ధి చేశామని చెప్పింది. అదేవిధంగా కరీంనగర్లో పనిచేస్తున్నందుకు 20 స్కూళ్లను ఎంపిక చేశామని తెలిపింది.

    తన తాత, తండ్రి ఇలాంటి సర్కారు బడుల్లో చదువుకొని పైకి వచ్చారని చెప్పారు. వారి పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చింది. మీరు బాగా చదువుకుంటేనే లక్ష్యాన్ని సాధిస్తారని విద్యార్థులను ఎంకరేజ్ చేసింది. మీ పిల్లలను పెద్దపెద్ద స్కూళ్లలో చదివించాలని నా కోరిక అని పేర్కొన్నారు. అమెరికాతో పాటు వివిధ దేశ విదేశాల్లో ఉంటున్న కరీంనగర్ జిల్లా ఎన్నారైలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పాఠశాలలకు అభ్యున్నతికి మంచు లక్ష్మి ముందుకు రావడం మార్పునకు నాంది పలకడమే.. ఇదే టీచ్ ఫర్ చేంజ్ లక్ష్యం.