Malla Reddy: 30వ తారీఖున వేలుకు ఇంకు.. 3వ తారీఖు స్టేట్ అంతా పింకు.. మల్లన్న స్టైలే వేరబ్బా.. వైరల్ వీడియో

మేడ్చల్ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ తరఫునుంచి వజ్రేష్ యాదవ్ ఉన్నారు.. ఆ నియోజకవర్గంలో ఈ ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరు నడుస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 24, 2023 12:54 pm

Malla Reddy

Follow us on

Malla Reddy: ఆయన ఏం చేసినా, ఇంకేం మాట్లాడినా వైరల్ అవుతూ ఉంటుంది. తెలంగాణ స్లాంగ్, ఊర మాస్ టంగ్ ఆయనను సోషల్ మీడియా స్టార్ ను చేశాయి. ఏ ముహూర్తానా పాలమ్మిన, పూలమ్మిన అన్నాడో గాని.. ఆ మాటల దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. యూట్యూబర్ల నుంచి పెద్దపెద్ద న్యూస్ చానల్స్ వరకు ఆయన ఇంటర్వ్యూలకు పోటీ పడటం ప్రారంభించాయి. ఆయన మాట్లాడే విధానం, బాడి లాంగ్వేజ్ నెటిజన్లకు నచ్చడంతో సోషల్ మీడియా స్టార్ ను చేశాయి. ఇంతకీ ఆయన ఎవరో కాదు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న చామకూర మల్లారెడ్డి..

మేడ్చల్ నియోజకవర్గం నుంచి..

మేడ్చల్ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ తరఫునుంచి వజ్రేష్ యాదవ్ ఉన్నారు.. ఆ నియోజకవర్గంలో ఈ ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరు నడుస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.. అయితే మల్లారెడ్డిని టీవీ9 ఛానల్ వాట్ థింగ్స్ తెలంగాణ అనే కాన్ క్లేవ్ నిర్వహించింది.. ఈ కార్యక్రమానికి కేటీఆర్ తో సహా పెద్ద పెద్ద నాయకులను ఆహ్వానించింది. అందులో మల్లారెడ్డి కూడా ఒకరు. ఈ సందర్భంగా టీవీ9 ఛానల్ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మల్లారెడ్డి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. వాస్తవానికి మల్లారెడ్డి పాత్రికేయులు అడిగే ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పరు..

ఒక మాటతో వైరల్ అయిపోయారు

ముందుగానే మనం చెప్పినట్టు ఆయన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిని అత్యంత తెలివిగా సైడ్ చేస్తారు మల్లారెడ్డి. అడిగే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేనప్పుడు స్వరం పెంచుతారు. ఎదుటివారిని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అప్పుడే తాను ఏదైతే చెప్పదలుచుకున్నారో దానిని బలంగా చెప్పేస్తారు. దానికి హైదరాబాద్ స్టైల్ తెలుగుకు అద్దేస్తారు. అది వెంటనే వైరల్ అయిపోతుంది. ఇక టీవీ9 నిర్వహించిన కాన్ క్లేవ్ లోనూ “30వ తారీఖున వేలుకు ఇంకు. మూడవ తారీఖున స్టేట్ మొత్తం పింకు” అని కామెంట్ చేశారు. ఆ కామెంట్ కు అక్కడ ఉన్న టీవీ9 ప్రతినిధులు కూడా విరగబడి నవ్వారు. ఇవి సోషల్ మీడియా రోజులు కాబట్టి దెబ్బకు మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిపోయాయి.. మరి 30 వ తారీఖు స్టేట్ మొత్తం చేతికి ఇంకు పెట్టుకుంటుంది. ఆ ఇంకు పింక్ అవుతుందా మరోటి అవుతుందా అనేది మూడవ తారీఖున తేలుతుంది.