HomeతెలంగాణLok Sabha Election Results 2024: తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల భారీ ఆధిక్యం..

Lok Sabha Election Results 2024: తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల భారీ ఆధిక్యం..

Lok Sabha Election Results 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. 17 స్థానాల్లో ఎక్కువ చోట్ల బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. వరంగల్‌లో ఆరూరి రమేశ్‌ 242 ఓట్ల లీడ్‌లో ఉండగా, మిగతా బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యం కనబరుస్తున్నారు. కిషన్‌రెడ్డి(సికింద్రబాద్‌), ఈటల రాజేందర్‌(మల్కాజ్‌గిరి), గొడం నగేశ్‌(ఆదిలాబాద్‌), బండి సంజయ్‌(కరీంనగర్‌), ధర్మపురి అర్వింద్‌(నిజామాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(చెవెళ్ల), డీకే.అరుణ(మహబూబ్‌నగర్‌), భరత్‌ప్రసాద్‌(నాగర్‌కర్నూల్‌)లో ఆధిక్యంలో ఉన్నారు. ఈటల రాజేందర్‌ మల్కాజిగిరిలో 1.50 లక్షల లీడ్‌లో ఉన్నారు. కరీనంగర్‌లో బండి సంజయ్‌ 50 వేల ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. నిజాబాబాద్, చేవెళ్లలో అర్వింద్, భరత్‌ 30 వేల లీడ్‌లో ఉన్నారు. గొడం నగేశ్‌ 20 వేల లీడ్‌లో ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో డీకే.అరుణ 5 వేల ఓట్ల మెజారిటీలో ఉన్నారు. హైదరాబాద్‌లో మాధవీలత తొలి రౌండ్‌లో 14 వేల ఓట్ల లీడ్‌ సాధించారు.

ఖమ్మంలో కాంగ్రెస్‌ భారీ లీడ్‌..
ఇక తెలంగాణలోని ఖమ్మంలో రఘురామిరెడ్డి(కాంగ్రెస్‌) ఆరో రౌండ్‌ ముగిసే నాటికి 60 వేల లీడ్‌ సాధించారు. పెద్దపల్లిలో గడ్డం వశీ, జహీరబాద్‌లో సురేష్‌ షట్కార్, భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌బాద్‌లో బలరాం నాయక్, నల్గొండలో రఘువీర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మెదక్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మొదటి రౌండ్‌లో వెంకట్రామిరెడ్డి లీడ్‌లో ఉండగా, రెండో రౌండ్‌లో రఘునందన్‌రావు లీడ్‌లోకి వచ్చారు. తర్వాత మూడో రౌండలో మళ్లీ బీఆర్‌ఎస్‌ లీడ్‌లోకి వచ్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version