Nehru Zoo Park: హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో దారుణం.. బయటకు వచ్చిన సింహం ఏం చేసిందంటే?

ప్రతీ రోజు సింహానికి ఆహారం వేసే ముందు ఎన్ క్లోజర్ ను శుభ్రం చేస్తారు యానిమల్ కీపర్. అలా శుభ్రం చేస్తున్న క్రమంలో దాడి చేసింది. దీంతో యానిమల్ కీపర్ హుస్సేన్ కు గాయాలయ్యాయి. ఉదయం ఆడసింహం ‘శిరీష’ ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లి శిరీషను సమీపంలోని ఎన్ క్లోజర్ లోకి పంపించాడు. ఈ సందర్భంలో గడియ పెట్టడం మరిచిపోయాడు. దీంతో శిరీష తన ఎన్ క్లోజర్ లోకి వచ్చింది. అక్కడే శుభ్రం చేస్తున్న హుస్సేన్ పై దాడి చేసింది.

Written By: Neelambaram, Updated On : July 9, 2024 4:04 pm

Nehru Zoo Park

Follow us on

Nehru Zoo Park: హైదరాబాద్ లోని ప్రఖ్యాత నెహ్రూ జువాలాజికల్ (జూ) పార్కులో అప్పుడప్పుడు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. నిత్యం సందర్శకులతో కిక్కిరిసి ఉంటుంది ఈ జూ పార్క్. అందుకే అప్పుడప్పుడూ జంతువులకు మనుషులకు మధ్య హఠాత్ సంఘటనలు జరుగుతాయి. గత అక్టోబర్ లో జూ కీపర్ ఒకరు ఏనుగు దాడిలో మరణించారు. మరో సారి లయన్ ఎన్ క్లోజర్ లోకి ఒక వ్యక్తి ప్రవేశించగా.. సింహం ఆయనను చంపివేసింది.

ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జూ సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. సందర్శకులను, జంతువులను నిశితంగా పరిశీలిస్తుంటారు. ఎప్పటికప్పుడు మైకుల ద్వారా వార్న్ చేస్తుంటారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే జూ సిబ్బందికి మాత్రం ఒక్కోసారి జంతువులకు బలవుతుంటారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఇటీవల సింహం ఎన్ క్లోజర్ లోకి వెళ్లిన యానిమల్ కీపర్ పై దాడికి యత్నంచింది. కానీ ఆయన తప్పించుకునే క్రమంలో సింహం బోను నుంచి బటయకు వచ్చింది.

ప్రతీ రోజు సింహానికి ఆహారం వేసే ముందు ఎన్ క్లోజర్ ను శుభ్రం చేస్తారు యానిమల్ కీపర్. అలా శుభ్రం చేస్తున్న క్రమంలో దాడి చేసింది. దీంతో యానిమల్ కీపర్ హుస్సేన్ కు గాయాలయ్యాయి. ఉదయం ఆడసింహం ‘శిరీష’ ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లి శిరీషను సమీపంలోని ఎన్ క్లోజర్ లోకి పంపించాడు. ఈ సందర్భంలో గడియ పెట్టడం మరిచిపోయాడు. దీంతో శిరీష తన ఎన్ క్లోజర్ లోకి వచ్చింది. అక్కడే శుభ్రం చేస్తున్న హుస్సేన్ పై దాడి చేసింది.

దీంతో కంగారుపడిన హుస్సేన్ ఎన్ క్లోజర్ గేట్ వేయకుండానే బయటకు పరుగులు తీశాడు. దీంతో సింహం కూడా బయటకు వచ్చింది. వెంటనే జూ అధికారులతో సహా వెటర్నరీ సిబ్బంది మత్తు ఇచ్చారు. అది పడిపోయాక తిరిగి ఎన్ క్లోజర్ లోకి చేర్చారు. నేడు (సోమవారం) జూకు సెలవు దినం కావడంతో సందర్శకులు ఎవరూ లేరు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సందర్శకులు ఉండి ఉంటే సింహం దాడి ఘోరంగా ఉండేదని పలువురు చర్చించుకుంటున్నారు. మరీ ఇంత అలసత్వం ప్రదర్శించవద్దని గడియ పెట్టకుండా ఎన్ క్లోజర్ లోకి ఎలా ప్రవేశిస్తారని మండిపడుతున్నారు.

Tags