Kalvakuntla Kavitha : కవిత కారాగారవాసం ముగిసేదెప్పుడు.. చెల్లిని కలిసి ధైర్యం చెప్పిన అన్న!

Kalvakuntla Kavitha తన కూతురును కలిసేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా తిహార్‌ జైలుకు వెళ్లలేదు. తన గారాల బిడ్డగా చెప్పుకునే కేసీఆర్‌, కూతురు జైలుకు వెళ్లి మూడు నెలలైనా ఒక్కసారి కూడా వెళ్లి కలవకపోవడం గమనార్హం

Written By: NARESH, Updated On : June 14, 2024 9:08 pm

KTR visited Kalvakuntla Kavitha in Delhi's Tihar Jail

Follow us on

Kalvakuntla Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కుకుని తిహార్‌ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కారాగార వాసం ఇప్పట్లో పూర్తయ్యే అకాశం కనిపించడం లేదు. సౌత్‌గ్రూప్‌ కీ పిన్‌ అయిన కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ కోర్టును కోరుతున్నాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవిస్తున‍్న కోర్టు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. తాజాగా ఆమె జుడీషియల్‌ కస్టడీ జూన్‌ 21 వరకు పొడిగింది.

బయటకు తీసుకు రావడానికి..
ఇక కవితను బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబ సభ్యులు, లాయర్లు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల దర్యాప్తు సంస్థలు చార్జిషీట్‌ దాఖలు చేసినందున బెయిన్‌ వస్తుందని అంతా భావించారు. కానీ, జూన్‌ 4న కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ బెయిల్‌ ఇవ్వొద్దని కోరింది. ఇక చార్జిషీట్‌లో నిర్ధిష్టమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. దీంతో అప్పటి వరకు అనారోగ్యం, కొడుకు పరీక్షలు, ఎన్నికల ప్రచారం తదితర కారణాలతో బెయిల్‌ కోరిన కవిత ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. బెయిల్‌ అడిగిన ప్రతీసారి దరా‍్యప్తు సంస్థలు కొత్త విషయాలను తెరపైఇ తెస్తున్నాయి. దీంతో బెయిల్ వాయిదా పడుతూనే ఉంది.

ములాఖత్‌ అయిన కేటీఆర్‌..
ఇదిలా ఉండగా, దాదాపు మూడు నెలలుగా తిహార్‌ జైల్లో ఉన్న కవితను శుక్రవారం(జూన్‌ 14న) ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తిహార్‌ఖ జైల్లో ములాఖత్ అయ్యారు. కవిత యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ కవిత సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ములాఖత్ అయ్యారు. మర్యాద పూర్వకంగా కవితను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు.

ఒక్కసారి కూడా వెళ్లని కేసీఆర్‌..
ఇదిలా ఉంటే.. తన కూతురును కలిసేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా తిహార్‌ జైలుకు వెళ్లలేదు. తన గారాల బిడ్డగా చెప్పుకునే కేసీఆర్‌, కూతురు జైలుకు వెళ్లి మూడు నెలలైనా ఒక్కసారి కూడా వెళ్లి కలవకపోవడం గమనార్హం. కవిత భర్త, పిల్లలు, తల్లి, సోదరుడు మాత్రమే కలిసి వస్తున్నారు.