KTR e formula case
KTR e formula case : ఇంకా అరెస్టు కాలేదు. అరెస్టు అవుతాడో లేదో కూడా తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana state chief minister revanth Reddy) ఇటువంటి అడుగులు వేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఎలాంటి మార్గంలో ఫిక్స్ చేస్తాడో అంతు పట్టడం లేదు. అయితే ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి అండ్ కో ఇంతవరకు పెద్దగా మాట్లాడలేకపోయినప్పటికీ.. కేటీఆర్ మాత్రం రోజుకు తిరిగా మాట్లాడుతున్నాడు.. ఈ దేశంలో చాలామంది నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొంతమంది జైలుకు వెళ్లారు.. మరి కొంతమంది తమ సచ్చీలతను నిరూపించుకున్నారు.
ఫార్ములా రేసు కేసులో కేటీఆర్ చేస్తున్న వాదనలు కూడా విచిత్రంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు ఇందులో అవినీతి జరగలేదని, ఇది లొట్ట పీసు కేసు అని, హైదరాబాద్ నగరానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ అంటున్నాడు. అందులో ఎటువంటి అవినీతి జరిగినప్పుడు.. అవినీతి జరగడానికి ఆస్కారం లేనప్పుడు మెరిసిన ముత్యం లాగా బయటికి వస్తే కేటీఆర్ కే ఇమేజ్ మరింత పెరుగుతుంది కదా. పైగా ఈ దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని కేటీఆర్ చెబుతున్నాడు. విచారణకు సహకరిస్తానని అంటున్నాడు.. అలాంటప్పుడు న్యాయస్థానాలను పక్కనపెట్టి.. న్యాయమూర్తులను పక్కనపెట్టి కొత్త విచారణ విధానానికి సై అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం దేనికి? ఏ దర్యాప్తు సంస్థ అయినా, ఎలాంటి కోర్టైనా దానికి అంగీకరిస్తుందా? ఈ కేసు ప్రారంభంలో అసెంబ్లీలో చర్చకు రెడీనా అని సవాల్ విసిరాడు.. కానీ ఇక్కడే కేటీఆర్ అసలు విషయం మర్చిపోయాడు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు.. ఏ నాయకుడైనా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కోర్టులు తేల్చుతాయి.. అంతేతప్ప అసెంబ్లీలు, పార్లమెంట్ లు కేసులను విచారించవు. ఇంతవరకు మనదేశంలో ఇలాంటి విధానాలు జరగవు..
” ఎంత ఖర్చు దేనికి రేవంత్.. చాలా చవకైన పద్ధతి నీకు చెబుతాను. రేవంత్ నా మీద అక్రమంగా కేసు పెట్టాడు.. ఒక న్యాయమూర్తి సమక్షంలో లైవ్ డిబేట్ నిర్వహించుకుందాం. లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించుకుందాం. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఉన్నాడా?” ఇదీ కేటీఆర్ ప్రతిపాదన.. ఓటుకు నోటు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులను అక్కడే చర్చిద్దాం.. తేల్చి పడేద్దాం అని సవాల్ విసురుతున్నాడు. ఇతర కేసులను కూడా ఇలాగే మీడియా ఎదుట లై డిటెక్టర్ టెస్టులతో తేల్చాలని అంటున్నాడు. ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టులో ఉంది. మరవైపు ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ పై క్వాష్ చేయడం సాధ్యం కాదని కోర్టు ఇప్పటికే చెప్పింది.. అంటే ఈ కేసులు రెండు కూడా కోర్టుల పరిధిలో ఉన్నట్టే కదా. రేపటి నాడు ఈ కేసుల విషయంలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఒకవేళ ఉపసంహరించుకున్నప్పటికీ.. కోర్టులు కచ్చితంగా అంగీకారం తెలపాలి. వాస్తవానికి కేటీఆర్ కు కూడా ఇలాంటి వాదనవల్ల జరిగేది, ఒనగూరేది ఏదీ ఉండదని తెలుసు. కాకపోతే చదువుకున్న వ్యక్తిగా ఇలాంటి వ్యాఖ్యలు తాను చేస్తే సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో కాస్త తెలుసుకోవాలి. పరవైపు ఈ కేసులో మనీలాండరింగ్, అక్రమంగా చెల్లింపులు, గ్రీన్ కో ఇచ్చిన విరాళాలు, క్విడ్ ప్రో కో వంటి కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే నమస్తే తెలంగాణ రాసినట్టు ఈ కేసు వెంటనే తేలిపోయేది కాదు.. కేబినెట్ ఆమోదం లేకుండానే చెల్లింపులు జరిపారు. పౌండ్ల రూపంలో డబ్బులు చెల్లించారు. ఆర్బిఐ పర్మిషన్ లేకుండా ప్రైవేట్ సంస్థలకు నగదు ఇచ్చారు. ప్రవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం ఎందుకు భరించాలి.. రేస్ స్పాన్సర్స్ కూడా తప్పుకున్నారు.. ఇలాంటి సంక్లిష్టతలు అనేకం ఈ కేసులో ఉన్నాయి. చివరిగా కాలేశ్వరం విషయంలో.. కరెంటు కొనుగోలు విషయంలో కెసిఆర్ పై అనేక విచారణ సంస్థలు పనిచేస్తున్నాయి. గత ఒప్పందాలను లోతుగా స్టడీ చేస్తున్నాయి. సో ఇవన్నీ ఎందుకు.. లై డిటెక్టర్ కు నేను సిద్ధమని కెసిఆర్ అనగలడా.. అనలేడు.. అనే అవకాశం కూడా లేదు.. ఎందుకంటే సిస్టం గురించి కెసిఆర్ కు బాగా తెలుసు. తెలియనిదల్లా కేటీఆర్ కే.