KTR : ఫార్ములా ఈ – కారు రేస్ లో (Formula e – car race) గురువారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో అనేక రకాల అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (kalvakuntla taraka Rama Rao)ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఇటు కేంద్రం, అటు రాష్ట్రం ఈ కేసులో ఇన్వాల్వ్ కావడంతో కేటీఆర్ కు కష్టకాలం దాపురించినట్టేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దర్యాప్తు సంస్థలు ఈ కేసును అత్యంత కీలకంగా తీసుకోవడంతో కేటీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ కేసులో ఏ-2 గా ఉన్న నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి(municipal department special secretary) అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బి ఎల్ ఎన్ రెడ్డి (Hyderabad metro development authority chief engineer bln Reddy)ని ఇప్పటికే ఈడి (enforcement directorate) అధికారులు విచారించారు. గురువారం విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రశ్నలు అడిగి మాత్రమే ఇంటికి పంపుతారా? లేకుంటే కేటీఆర్ ను వెంటనే అరెస్ట్ చేస్తారా? అనే విషయాలపై సందిగ్ధం నెలకొంది. ఈ కేసులో ఈ నెల 9న కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పారు. అదేరోజు సాయంత్రం కేటీఆర్ తిరిగి రావడంతో గులాబీ కార్యకర్తలు ఎగిరి గంతులు వేశారు. ఇదే సమయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కేటీఆర్ హైకోర్టు తలుపు తట్టారు. పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీనిని హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేటీఆర్ తరఫున న్యాయవాదులు తమ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (supreme court నుంచి వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామంతో ఏం జరుగుతుందోనని ఆందోళన గులాబీ పార్టీ కార్యకర్తల్లో నెలకొంది. ఇది ఇలా ఉండగానే ఏసీబీ మరోసారి కేటీఆర్ ను ప్రశ్నిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించిన తర్వాత.. ఎటువంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చని జాతీయ మీడియా సైతం కథనాలను ప్రసారం చేస్తోంది.
ఈడీ ఏం చెబుతోందంటే..
ఈ కేసు విషయంలో ఈడీ అధికారులు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది.. ఈ కేసు విషయంలో ఏసీబీ అధికారులు గత నెలలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగానే అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేశారు.. అంతేకాదు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA), ఫారిన్ ఎక్స్చెంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(FEMA) కింద అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. HMDA సాధారణ ఖాతా నుంచి ఫార్ములా ఈ – ఆపరేషన్స్ (EFO) కు రెండు విడతలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో నాటి ప్రభుత్వం చెల్లించిన నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుగుతోంది. ఈ చెల్లింపులకు సంబంధించి ఇన్ వాయిస్ లు ఎఫ్ ఈవో నుంచి ఆదేశాలు అందిన తర్వాతే తాను ప్రోసిడింగ్ ఆర్డర్లు ఇచ్చానని ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో అంగీకరించినట్టు సమాచారం. ఆర్థిక రంగ నిపుణుల అంచనా ప్రకారం.. విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీలో డబ్బు పంపించాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు పొందకుండా.. క్యాబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే నిధులు బదిలీ జరగడాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రముఖంగా దృష్టి సారిస్తోంది. అయితే ఇందులో ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసు విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది.