KTR: తెలంగాణలో ఫార్ములా ఈ రేసు కోసం అక్రమంగా రూ.56 కోట్లు విదేశీ సంస్థకు కేటాయించిన కేసులో మాజీ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారాకరామారావుపై కేసు నమోదైంది. రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా నిధులు కేటాయించడంపై తెలంగాణ ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానా విధించింది. దీంతో ప్రభుత్వం నిధులు దారిమళ్లినట్లు గుర్తించి గవర్నర్ అనుమతితో ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై క్వాష్ పిటిషన దాఖలు చేసిన కేటీఆర్‌కు అరెస్టు నుంచి ఊరట లభించింది. కానీ విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో జనవరి 6న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈమేరు కేటీఆర్ సోమవారం ఏసీబీ ఆఫీస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా లాయర్‌ను వెంట పెట్టుకుని వెళ్లారు. అయితే ఏసీబీ కార్యాలయంలోకి లాయర్లను అధికారులు అనుమతించలేదు. దీంతో కేటీఆర్ కూడా కార్యాలయంలోకి వెళ్లలేదు. దీంతో అరగంట పాటు కార్యాలయం బయటే వేచి ఉన్నారు. చాలా సేపటి తర్వాత తాను ఇవ్వాలనుకున్న సమాచారాన్ని రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందించారు. హైకోర్టు తీర్పు తర్వాతే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఏసీబీని కోరారు.
డిసెంబర్ 18 ఎఫ్‌ఐఆర్..
ఫార్ములా ఈ రేస్ కేసుపై డిసెంబర్ 17న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనిపై కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 18న ఎఫ్‌ఐఆర్‌పై కోర్టులో సవాల్ చేశామని 31న వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ విషయాలను కూడా కేటీఆర్ తర సమాధానంలో పొందుపర్చారు. ఈ కేసులో ఏసీబీ ప్రతివాదిగా ఉన్న విషయం గుర్తు చేశారు. తీర్పు ప్రకటించే వరకు విచారణ నిలిపివేయాలని కోరారు. అయినా ఏసీబీ తనకు నోటీసులు ఇచ్చి.. వివరణతోపాటు పత్రాలు ఇవ్వాలని కోరిందని తెలిపారు. అయితే ఏ సమాచారం కావాలో స్పష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. ఏయే డాక్యుమెంట్లు కావాలో కూడా తెలుపలేదని పేర్కొన్నారు.
చట్టాన్ని గౌరవించే పౌరుడిగా..
తాను చట్టాన్ని గౌరవిస్తానని, అందుకే ఏసీబీ కార్యాలయానికి వచ్చానని కేటీఆర్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. గతంలో పన్న నరేందర్‌రెడ్డి విచారణ సందర్భంగా తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారని, ఇప్పుడు తన విచారణ సందర్భంగా కూడా తప్పుడు స్టేట్‌మెంట్ ఇస్తుందని ఆరోపించారు. న్యాయవాదులు తన వెంట ఉంటే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఒక పౌరుడిగా తన హక్కులను కాపాడుకోవడానికే న్యాయవాదుల సహకారం తీసుకున్నానని తెలిపారు.
ఇంటిపై దాడులు..
ఇక తనను విచారణకు పిలిచి తన ఇంటిపై దాడికి కూడా రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ దాడుల్లో రెవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏదైఆ చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచే కుట్ర కూడా జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే వరకూ వదిలి పెట్టమని పేర్కొన్నారు.