https://oktelugu.com/

Konda Surekha vs KTR : కేసీఆర్ కనిపించడం లేదు.. కేటీఆర్ ఏమైనా చేసి ఉంటాడు.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు

సమంత -నాగచైతన్య విడాకుల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి.. తెలుగు రాజకీయలలో సంచలనంగా మారారు మంత్రి కొండా సురేఖ. సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించడంతో సురేఖ ఒక అడుగు వెనక్కి వేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2024 / 10:25 PM IST

    Minister Konda Surekha

    Follow us on

    Konda Surekha vs KTR : సమంత విషయంలో కాస్త ఉదారత చూపిన కొండా సురేఖ.. కేటీఆర్ విషయంలో మాత్రం తన కోపాన్ని చల్లార్చుకోవడం లేదు. పైగా కేటీఆర్ పై మరింత తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం వారు ట్రోల్ చేస్తున్నప్పటికీ సురేఖ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా కేటీఆర్ నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా కొనసాగారని ఆరోపించారు. కెసిఆర్ ను నామమాత్ర పాత్రకు పరిమితం చేశారని విమర్శించారు. ” నాటి ప్రభుత్వంలో కేసీఆర్ కేవలం అలా కుర్చీలో కూర్చున్నారు. తెర వెనుక పాత్ర మొత్తం కేటీఆర్ పోషించారు. అందువల్లే నాడు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సీనియర్ లీడర్లకు అర్థమయ్యేది కాదు. కేటీఆర్ ఒంటెత్తు పోకడల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయిందని” కొండా సురేఖ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం వారు తిప్పికొడుతున్నారు. మంత్రి కొండా సురేఖను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ కొండా సురేఖ వెనక్కి తగ్గడం లేదు.

    తాజాగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో కొండా సురేఖ కేటీఆర్ పై మరో సంచలన ఆరోపణలు చేశారు.. ఇటీవల కాలంలో కేసీఆర్ కనిపించడం లేదని.. కేటీఆర్ గొంతు పిసికి చంపి ఉంటాడని విమర్శించారు. సహజంగా ఈ వ్యాఖ్యలకు మీడియా విశేషమైన ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో ఏ రాజకీయ నాయకుడు చేయని ఆరోపణ కొండా సురేఖ చేయడంతో సంచలనంగా మారింది. పైగా కొండా సురేఖ తెలంగాణ రాష్ట్రానికి మంత్రి కావడంతో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

    ఇక ఇదే క్రమంలో సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారంలో అనవసరమైన ఆరోపణలు చేశారంటూ సినీనటుడు నాగార్జున.. కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. అయితే వాటికి ఎటువంటి సమాధానాలు చెప్పారో తెలియక పోయినప్పటికీ.. కొండా సురేఖ మాత్రం కేటీఆర్ ను వదిలిపెట్టడం లేదు. ఆయనపై రోజుకో తీరుగా సంచలన ఆరోపణలు చేస్తూ.. వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఇది ఎక్కడ వరకు దారితీస్తుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికి అయితే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సురేఖ మరోసారి కేటీఆర్ పై విమర్శలు చేయడంతో భారత రాష్ట్రానికి అనుకూల సోషల్ మీడియా విభాగం వారు రెచ్చిపోతున్నారు. కొండా సురేఖ పై పరిధి దాటి విమర్శలు చేస్తున్నారు.