Konda Couple Meets CM Revanth Reddy: ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. ఇది చినికి చినికి గాలి వాన లాగా మారింది. ఆ తర్వాత కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అతడిని తొలగించింది. అంతేకాదు ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదయింది.
సిమెంట్ కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు అతడిని అదుపులో తీసుకోవడానికి వెళ్లిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత ప్రతిఘటించింది. దీంతో పోలీసులు వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఇదంతా కూడా మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికార పార్టీపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు ఓ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఓ వ్యక్తి తుపాకీ పట్టి బెదిరించాడని.. డబ్బుల వ్యవహారంలో పంచాయతీ వచ్చిందని సాక్షాత్తు మంత్రి కుమార్తె ఆరోపించడంతో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి ఇది ఒక ఆయుధం లాగా మారింది.
మరోవైపు మేడారం అభివృద్ధి పనుల విషయంలో ఓ మంత్రి అందులో వేలు పెట్టారని.. దేవదాయ శాఖ మంత్రి కి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపించాయి. దీంతో అభివృద్ధి పనులపై జరుగుతున్న సమీక్షకు సురేఖ హాజరు కాలేదు. మంత్రివర్గ సమావేశానికి కూడా ఆమె దూరంగా ఉన్నారు. దీంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని ప్రచారం జరిగింది. దీనికి తోడు సురేఖ ఇంటి వద్ద పోలీసు భద్రతను తగ్గించడంతో పై ఆరోపణలకు మరిత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే సుస్మిత, సురేఖతో భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ తోనే కొండ మురళి, కొండ సురేఖ దంపతులు జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు అక్కడే ఉన్నారు.. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన నేపథ్యంలో.. కొండ దంపతులు ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాశంగా మారింది. మరోవైపు కొండ మురళి కూడా ఆ మధ్య విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. పైగా తనకు ఎమ్మెల్సీ ఇస్తారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని.. ముఖ్యమంత్రి మీద తనకు ప్రగాఢమైన నమ్మకం ఉందని మురళి పేర్కొన్నారు. ఈ పరిణామాలు మొత్తం ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి.
జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు ఇదంతా చేరడంతో ఒక రకంగా అధికార పార్టీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నది. నష్ట నివారణ చర్యలలో భాగంగా పార్టీ నాయకత్వం రంగంలోకి దిగడంతో కొండా దంపతులు మెత్తబడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సంధికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఫలితంగా దీపావళి రోజు ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి మాట్లాడారని.. ఇక వివాదం ముగిసినట్టేనని తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ దంపతులు
జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ
కొండా దంపతులను సీఎం నివాసానికి తీసుకెళ్ళిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశకుమార్ గౌడ్ https://t.co/b587fhS4jw pic.twitter.com/LxVOrdpn6e
— Telugu Scribe (@TeluguScribe) October 20, 2025