Komatireddy warning media: మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి. ముఖ్యంగా సంచలనాత్మకమైన కథనాలను ప్రసారం చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. వాస్తవాలను రూడీ చేసుకోవాలి. ఆ తర్వాత కథనాలను ప్రసారం చేయాలి. ఎందుకంటే ఒక మీడియా సంస్థ నుంచి ప్రసారమయ్యే ప్రతి కథనానికి సమాజం ప్రభావితం అవుతుంది. ఆ విషయాన్ని మీడియా ఎప్పటికీ మర్చిపోకూడదు.
దురదృష్టవశాత్తు ప్రస్తుతం తెలుగులో వాస్తవాలు కంటే సంచలనాలకే మీడియా ప్రాధాన్యమిస్తుంది. ఇందులో వాస్తవాలను పరిశీలించకుండానే అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తోంది. దీనివల్ల ఆయా వ్యక్తులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇక సమాజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు…
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్టీవీ ఒక సంచలనాత్మకమైన కథనాన్ని ప్రసారం చేసింది. అందులో ఒక మహిళ ఐఏఎస్ అధికారి పేరును కూడా పరోక్షంగా ప్రస్తావించింది. ఒక రకంగా ఆ మంత్రికి, ఆమెకు మధ్య ఏదో జరుగుతోంది అని ప్రచారం మొదలుపెట్టింది.. కుచ్ కుచ్ హోతా హై అన్నట్టుగా దానికి మసాలా దట్టించింది. వాస్తవానికి ఒక మంత్రి మీద ఇలాంటి కథనాన్ని ప్రసారం చేస్తున్నప్పుడు వాస్తవాన్ని పరిశీలించాల్సి ఉండేది. అలాకాకుండా ఆ మీడియా సంస్థ తన వ్యూస్ కోసం ఇలాంటి కథనాన్ని ప్రసారం చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా కలకలం నెలకొంది…
ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాన్ని గులాబీ మీడియా, అనుకూల సోషల్ మీడియా ఛానల్స్ విపరీతంగా వాడుకున్నాయి. తెలంగాణ మంత్రులకు స్వేచ్ఛ ఎక్కువైపోయిందని.. ప్రేమయాణాలు కొనసాగిస్తున్నారని దానికి పెట్రోల్ పోసింది. ఇది కాస్త ప్రభుత్వంలో అలజడికి కారణమైంది. గులాబీ మీడియా ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఈ కథనాన్ని ముఖ్యమంత్రి వెనుక ఉండి ప్రసారం చేయించారని దిక్కుమాలిన ప్రచారం మొదలుపెట్టింది. ఎప్పుడైతే గులాబీ మీడియా ఇలా వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టిందో.. కోమటిరెడ్డి రంగంలోకి వచ్చారు. తనకు ఇంత విషమిచ్చి చంపేయమని ఆవేదనతో మాట్లాడారు. ఇక ఐఏఎస్ అధికారుల సంఘం ఆ ఛానల్ కు నోటీసులు పంపించింది. క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.
ఐఏఎస్ అధికారులు తెరమీదకి రావడంతో ఒకసారిగా తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సోషల్ మీడియా ఛానల్స్ కు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎన్టీవీకి కూడా నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి ఇటువంటి కథనాలను ప్రసారం చేసినప్పుడు కచ్చితంగా ఆ చానల్స్ ను అడుగుదాకా తొక్కేయాల్సిందే. ఎందుకంటే ఇటువంటి కథనాల వల్ల వ్యక్తులు, వారి కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమవుతారు. అలాంటప్పుడు ఇటువంటి చానల్స్ కు నోటీసులు ఇస్తే పెద్దగా జరిగేది ఏదీ ఉండదు. తెలంగాణ ఎప్పుడైనా కొత్తలో ఏబీఎన్, టీవీ9 ఏదో వార్తలు ప్రసారం చేశాయని కెసిఆర్ ఏకంగా వాటి ప్రసారాలను నిలుపుదల చేయించారు. తద్వారా మీడియాకు భయాన్ని పరిచయం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లో నోటీసు ఇవ్వడం మినహా.. పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతటితో ఆగుతుందా.. ఏమైనా చర్యలు తీసుకుంటుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
మంత్రి కోమటిరెడ్డి పై వచ్చిన వార్త విషయంలో ఒకే వార్త – రెండు రకాల న్యాయం!
వార్తను మొదట ప్రసారం చేసిన మెయిన్ ఛానెల్‌కు మాత్రం కేవలం నోటీసులతో సరిపెట్టిన పోలీసులు
అదే వార్తను ఆధారంగా తీసుకుని న్యూస్ ఇచ్చిన మిగతా ఛానెల్స్‌పై మాత్రం నోటీసులు కూడా లేకుండా “నేరుగా స్టేషన్‌కు రండి”… https://t.co/zlXn30XMEj pic.twitter.com/daRgHYAYGz
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2026