Telangana Assembly Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అధికార బీఆర్‌ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం ఏడు, బీజేపీ 8, సీపీఐ ఒకస్థానంలో గెలిచాయి. అయితే ఫలితాల తర్వాత కొన్ని సంస్థలు పోస్ట్ పోల్ సర్వే చేశాయి. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. సంక్షిష్ట ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ విజయానికి, బీఆర్‌ఎస్ ఓటమికి కారణాలపై ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. ఈ ఫలితాలను ఇటీవల వెల్లడించాయి. ఈ ఫలితాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై పూర్తి వ్యతిరేకత, పూర్తి అనుకూలత లేదు.. అదే సమయంలో కాంగ్రెస్ పనా పూర్తి వ్యతిరేకత, పూర్తి అనుకూలత కనిపించలేదు. అయితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు.. అన్నట్లు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి కొన్ని కీలక అంశాలు కారణమయ్యాయి. చాలా మంది కేసీఆర్ పాలన బాగుందని చెప్పారు. కానీ కాంగ్రెస్‌కే ఓటేశామని వెల్లడించారు. ఇదే ప్రధానంగా బీఆర్‌ఎస్ ఓటమికి కారణమైంది. ఇక అవినీతి, అభ్యర్థులను మార్చకపోవడం, కుటుంబ పాలన, అహంకారం, నిరుద్యోగం, మార్పు కావాలి అన్న ఆకాంక్ష కూడా బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో దెబ్బతీశాయి.
సంతృప్తి ఉన్నా.. కాంగ్రెస్‌కే..
తెలంగాణలో కేసీఆర్ పాలనపై పూర్తి సంతృప్తి ఉన్నవారు 21 శాతం సతృప్తిగా ఉన్నట్లు లోక్‌నీతి సంస్థ సర్వేలో తేల్చింది. అయితే ఈ 21 శాతం ఓట్లలో 11 శాతం కాంగ్రెస్‌కు ఓటు వేశారు. 81 శాతం మంది బీఆర్‌ఎస్‌కే ఓటు వేశారు. సంతృప్తిగా ఉన్నవారిలో 11 శాతం ఓటర్లు కాంగ్రెస్‌వైపు మళ్లడం గమనార్హం.
స్వల్ప అసంతృప్తి ఉన్నవారు..
ఇక కొంత అసంతృప్తి ఉన్నవారు. కూడా బీఆర్‌ఎస్‌కంటే ఎక్కువగా కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారు. కొంత అసంతృప్తి ఉన్నట్లు ఎన్నికలకు ముందే గుర్తించిన కేటీఆర్ అలుగుడు అలుగుడే.. గుద్దుడు గుద్దుడే అని నినాదం ఇచ్చారు. ఈమేకు యాడ్ కూడా చేసి ప్రసాచం చేశారు. ప్రభుత్వంపై స్వల్ప అలక ఉన్న వారు 46 శాతం ఉండగా వీరిలో 38 శాతం కాంగ్రెస్‌కు, 37 శాతం బీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. అంటే.. బీఆర్‌ఎస్ ఆశించినట్లుగా అలిగిన వారు బీఆర్‌ఎస్‌కు పూర్తిగా గుద్దలేదు.
కొంత అసంతృప్తి ఉన్నవారు..
ఇక బీఆర్‌ఎస్ పాలనపై కొంత వ్యతిరేకత ఉన్నవారు కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటు వేయలేదు. మరో చాన్స్ ఇద్దామని ఆలోచించలేదు. ఇలాంటి వారు 16 శాతం ఉండగా ఇందులో 57 శాతం కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఇక్కడ బీఆర్‌ఎస్ నష్టపోయింది. ఆ పార్టీకి కేవలం 15 శాతం మాత్రమే ఓటు వేశారు.
ఇక పూర్తి వ్యతిరేకులు..
బీఆర్‌ఎస్, కేసీఆర్ పాలనపై పూర్తి అసంతృప్తి ఉన్నవారు పూర్తిగా కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారు. ఇలాంటి వారు తెలంగాణలో 15 శాతం ఉండగా, ఇందులో 62 శాతం కాంగ్రెస్‌కే ఓటు వేశారు. 23 శాతం బీజేపీకి ఓటు వేశారు. బీఆర్‌ఎస్‌కు కేవలం 3 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి.
మొత్తంగా బీఆర్‌ఎస్‌పై ఏమాత్రం అసంతృప్తి ఉన్నా.. వారి ఓటు పోలరైజ్ అయింది. ఇందులో చాలా ఓట్లు కాంగ్రెస్‌కు, కొన్ని ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. త్రిముఖపోరులు బయటపడతామని బీఆర్‌ఎస్ భావించినా.. ఫలితం మాత్రం కనిపించలేదు. సంతృప్తి ఉన్నవారి నుంచి పూర్తి అసంతృప్తి ఉన్నవారి వరకు అందరూ బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించారు. ఇదే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది. బీఆర్‌ఎస్‌ను అధికారానికి దూరం చేసింది.