KCR Problems: ఓటమి పాలైన తర్వాత జరిగిన వరుస పరిణామాలు కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఓటమి షాక్ లో నుంచి తేరుకునే లోపే ప్రమాదవశాత్తు పడి కాలు విరగడం, తరువాత లిక్కర్ కేసులో కూతురు కవిత జైలు పాలు కావడం, కొడుకు కేటీఆర్ కార్ రేసు కేసులో, తాను, తన మేనల్లుడు హరీష్ రావు కాళేశ్వరం కేసులో విచారణ ఎదుర్కోవాల్సి రావడం ఒక వంతైతే మరోవైపు ఇంట్లో అంతకలహాలు పార్టీలో లుకలుకలు కేసీఆర్ ను కలవరపెడుతున్నాయి. ఆధిపత్య పోరుతో అన్నా, చెల్లెలు మధ్య ఎవరికి నచ్చ చెప్పలేక, హెచ్చరించలేక సతమతమౌతున్నారు. పార్టీ పగ్గాలు వారసునికి అప్పగించి దర్జాగా ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు చేయవచ్చని భావించిన కేసీఆర్ ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని ఎలా అధిగమించాలి అనే దీర్ఘాలోచనలో పడిపోయారు. తాజాగా కాళేశ్వరం పై వచ్చిన ఘోష్ కమిషన్ విడుదల చేసిన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఏ విధంగా చర్యలకు ఉపక్రమిస్తుందనే విషయంలో ఎటుపాలుపోని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
Also Read: బీఆర్ఎస్ పై బీజేపీ విలీనాస్త్రం
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చూపిన దర్పం, ఆర్భాటం ప్రస్తుతం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన వారిని ఏవిధంగా రక్షించుకోవాలని ఆలోచనలు చుట్టుముట్టి ఆయన్ను మరింత క్రుంగదీసేలా చేస్తున్నాయి.
*టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు..*
చంద్రబాబుతో విభేదించి తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ఉరక లెత్తించి, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు, వేసిన ప్రణాళికలు, ఆచరించిన వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలో నాయకత్వ లేమితో, అభిప్రాయ బేధాలు రెండోసారి తిరిగి ముఖ్యమంత్రి పదవి వరించేందుకు దోహదం చేశాయి. మొదటి ఐదేళ్లు చక్కగా పాలన అందించిన సర్కార్ రెండో టర్మ్ లో ఇస్టానుసారంగా వ్యవహరించడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అదే సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో అనూహ్య విజయంతో ఒక్కసారిగా కుప్పకూలిన పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు గా పిలువబడే కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఒకవైపు ఇంటిపోరు మరోవైపు పార్టీలో చెలరేగుతున్న ధిక్కారస్వరాలతో ఆయన మదన పడిపోతున్నారు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏర్పాటుచేసిన ఒక ఉద్యమ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ ముందుకు అడుగు ముందుకు వెళ్తూ ఎన్నో జయాపజయాలను మూటగట్టుకుని ఎంతోమంది గొంగళి పురుగులను కౌగిలించుకొని, రాష్ట్ర సాధన ధ్యేయంగా అన్ని పార్టీలతో దాదాపు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని 2010 డిసెంబర్ నవంబర్ 29 నుంచి నవంబర్ 29 ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని పది రోజులపాటు రాష్ట్రంలో అన్ని వర్గాలను అన్ని పార్టీల నాయకులను ఏకం చేసి ఉద్యమాన్ని తన వైపుకు నిరంతర ఉద్యమ పోరాటంలో అలుపెరుగని నాయకునిగా పేరు పొందారు. రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేసి ప్రత్యర్థినీ ఊపిరిసల్పకుండా చేసే విద్యను ఔపోసన పట్టిన కేసీఆర్ తన్ను చుట్టుముట్టిన సమస్యలను ఎలా అధిగమిస్తారు అనే విషయమై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.