https://oktelugu.com/

Governor Tamilisai Vs KCR : పార్టీ లేదు పుష్ప.. గవర్నర్ విందును తిరస్కరించిన కేసీఆర్

గవర్నర్ ఏర్పాటు చేసిన తేనీటి విందు పార్టీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, సీనియర్ అధికారులు కూడా దూరంగా ఉండటంతో

Written By: , Updated On : August 15, 2023 / 08:31 PM IST
Follow us on

Governor Tamilisai Vs KCR : ‘పార్టీ లేదా పుష్ప’ అన్న డైలాగ్ ఇప్పుడు తెగ పాపులర్ అయిపోయింది. బయటనే కాదు.. రాజకీయ నాయకులు కలిసినా ఇదే డైలాగ్ వల్లెవేస్తున్నాయి. అయితే గవర్నర్ తమిళిసై పార్టీ ఇస్తానన్న నో చెప్పేశారు కేసీఆర్..నేను రాను అంటూ స్పష్టం చేశారు. ఇటీవల గవర్నర్ తో వచ్చిన వైరమే దీనంతటికి కారణం

రాష్ట్ర శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిఘటించడంపై ఇటీవలి వివాదం రాజుకుంది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం -రాజ్‌భవన్ మధ్య సంబంధాలు చెడిపోయాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం గవర్నర్ ఏర్పాటు చేసిన తేనీటి విందు పార్టీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, సీనియర్ అధికారులు కూడా దూరంగా ఉండటంతో ఇది హైలెట్ గా మారింది. మంగళవారం వీరి మధ్య దెబ్బతిన్న సంబంధాలు మరోసారి ప్రతిబింబించాయి.

కేబినెట్ మంత్రులందరితో పాటు ప్రగతి భవన్, సచివాలయానికి ఆహ్వానం పంపామని, అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తమిళిసై చెప్పారు. “నేను ఆహ్వానాన్ని మాత్రమే ఇవ్వగలను, కానీ వారు వస్తారా లేదా అనేది నా చేతుల్లో లేదు,” గవర్నర్ స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వ వైఖరి పట్ల తాను చాలా బాధపడ్డానని గవర్నర్ అన్నారు. ఎట్ హోం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బహిష్కరించడం సరికాదని ఆమె అన్నారు.

గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాలని కేసీఆర్ చేసిన సిఫార్సును ఆమె తిరస్కరించడంతో గత రెండేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. అప్పటి నుండి, ప్రభుత్వం ఎటువంటి ప్రోటోకాల్‌ను గవర్నర్‌కు ఇవ్వడం లేదు. రెండోది ప్రభుత్వం ఆమోదం కోసం పంపిన బిల్లులను గవర్నర్ ఆపేస్తుండడంతో మరింతగా వివాదం రాజుకుంటోంది.

అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లుల్లో నాలుగింటిని ఆమె తిరస్కరించగా, మరో రెండు బిల్లులను కేంద్రానికి పంపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఈ నాలుగు బిల్లులను మళ్లీ గవర్నర్‌కు పంపించింది., అయితే ఆమె వాటిని మళ్లీ తిరస్కరించలేనప్పటికీ, ఇంకా క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపేసింది..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి)ని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై కూడా తమిళిసై చాలా ప్రశ్నలను లేవనెత్తారు, దానికి షరతులతో కూడిన ఆమోదం ఇచ్చారు. చివరకు ఆర్టీసీ కార్మికులతో రాజ్ భవన్ ముట్టడించడంతో విమర్శలు చెలరేగడంతో బిల్లును ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా స్వాతంత్ర్య దినోత్సవం వేళ కూడా గవర్నర్ వర్సెస్ తమిళిసై వైరం కొనసాగింది. గవర్నర్ పార్టీకి కేసీఆర్ ను దూరం చేసింది.