KCR: ఎవర్రా మీరు.. కేసీఆర్ ను ఇలా తయారు చేశారు!.. వైరల్ వీడియో

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి జీవితంలో సమూ మార్పులకు కారణమవుతోంది. మొన్నటిదాకా విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానంగా పేరు పొందింది. ఇప్పుడు ఏకంగా మన జీవితాలను అత్యంత వేగంగా ప్రభావితం చేస్తోంది.

Written By: Bhaskar, Updated On : August 16, 2023 6:05 pm
Follow us on

KCR: కెసిఆర్ ఎలా ఉంటారు? బక్క పలచని దేహంతో, వైట్ అండ్ వైట్ డ్రెస్ తో.. కొన్ని దశాబ్దాల నుంచి ఆయన అదే విధంగా ఉంటున్నారు. అలాంటి కెసిఆర్ మ్యాడ్ మ్యాక్స్ లో హీరోలాగా, బాహుబలిలో ప్రభాస్ లాగా, రాక్ స్టార్ లో గిటార్ ప్లేయర్ లాగా, సారా పట్టా లో మల్ల యోధుడి లాగా, డీజే టిల్లు లో డీజే వాయించే వ్యక్తి గా, కమాండో లో సోల్జర్ లాగా కనిపిస్తే ఎలా ఉంటుంది? అదేంటి కెసిఆర్ ముఖ్యమంత్రి కదా? ఇవన్నీ ఎలా సాధ్యం అనే ప్రశ్న మీ మదిలో మెదలడం కామన్. మీ ప్రశ్నకు ఈ కథనంలో సమాధానం కచ్చితంగా లభిస్తుంది. అయితే ఎందుకు ఆలస్యం వెంటనే చదవండి మరి.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి జీవితంలో సమూ మార్పులకు కారణమవుతోంది. మొన్నటిదాకా విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానంగా పేరు పొందింది. ఇప్పుడు ఏకంగా మన జీవితాలను అత్యంత వేగంగా ప్రభావితం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొన్నటిదాకా కేవలం ఐటీ పరిశ్రమకు మాత్రమే పరిమితం అనుకున్నారు. కానీ ఇప్పుడు అది ఏకంగా వార్తలు కూడా చదివే స్థాయికి ఎదిగింది. భవిష్యత్తు రోజుల్లో ఎలాంటి మార్పులకు కారణం అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే అన్ని రంగాలను ఒక కుదుపు కుదుపుతోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పటిదాకా ప్రపంచంలో పేరు పొందిన వ్యక్తులను రకరకాల రూపాల్లో మనం చూసాం. వాటిని చూస్తూ చాలా ఆనందించాం. కానీ ఓ ఔత్సాహికుడు కెసిఆర్ తో రకరకాల ప్రయోగాలు చేశాడు. డి జె టిల్లు సినిమాలో టిల్లు లాగా, కమాండో సినిమా లో సోల్జర్ లాగా రకరకాల పాత్రల్లో ఒదిగిపోయేలా చేశాడు. ఆదమరచి చూస్తే ఇదేంటి కెసిఆర్ ఇలా ఉన్నారు అనే లాగా మార్చాడు.. ఏ మాటకు ఆ మాట ఈ రూపాల్లో కేసీఆర్ గులాబీ రంగును ధరించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉండే కేసీఆర్ ఇలా మారిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.