Kavitha vs Andhra Jyothi: ఐపీఎల్ లో ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు పంజాబ్ జట్టు ట్రోఫీ అందుకోలేదు. ప్రారంభం నుంచి ప్రీతిజింటా సహాయజమానిగా పంజాబ్ జట్టుకు కొనసాగుతోంది. 2014లో పంజాబ్ జట్టు చివరిసారిగా ప్లే ఆఫ్ కు ఎలిజిబిలిటీ సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ టాప్ -2లోకి వచ్చింది. పంజాబ్ జట్టు ఈ స్థాయిలో విజయాలు సాధించి ఇక్కడ దాకా వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం శ్రేయస్ అయ్యర్..ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను క్వాలిఫైయర్ -1 దాకా తీసుకెళ్లిన ఘనత అందుకున్నాడు. 2020లో ఢిల్లీ, 2024లో కోల్ కతా ను ఛాంపియన్ గా, 2025లో పంజాబ్ జట్టును క్వాలిఫైయర్ దాకా తీసుకొచ్చాడు. గత ఏడాది షారుక్ జట్టుకు ట్రోఫీ అందించినప్పటికీ.. ఆ ఘనత మొత్తం గౌతమ్ గంభీర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక గౌతమ్ గంభీర్ తో ఏర్పడిన విభేదాలతో అతడు కోల్ కతా మంచి బయటికి వచ్చాడు.. ఇక ప్రస్తుతం పంజాబ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా క్వాలిఫైయర్ -1 దాకా తీసుకొచ్చాడు.
పంజాబ్ జట్టుకు సారధిగా అయ్యర్ ఎంపికవడానికి తెర వెనుక ప్రీతి తీవ్రంగా కృషి చేసింది. అతని మీద పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచి.. ఏకపక్షంగా తన సమ్మతిని తెలియజేసింది.. దీంతో మిగతా సహ యజమానులు కూడా ఆమె నిర్ణయానికి ఒకే చెప్పాల్సి వచ్చింది. అయితే ఇక్కడే ప్రీతి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకోవాల్సి ఉంది. పంజాబ్ జట్టు సహజమానిగా ప్రీతి గత 18 సంవత్సరాలుగా టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. పంజాబ్ జట్టులో ప్రీతికి 23%, ది పార్క్ హోటల్స్ ఓనర్ కరణ్ పాల్ కు 6%, డాబర్, ఎవర్ రెడీ బ్యాటరీల తయారీ సంస్థ ఓనర్ మోహిత్ బర్మన్ కు 48 శాతం, బాంబే డయింగ్ కంపెనీ ఓనర్ నెస్ వాడియాకు 23% వాటాలు ఉన్నాయి.. అయితే పంజాబ్ జట్టు ఆడే మ్యాచ్ లకు కేవలం నెస్ వాడియా, ప్రీతి మాత్రమే హాజరవుతారు. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు..నెస్ వాడియా తో కలిసి కొన్నాళ్లపాటు ప్రీతి రిలేషన్ లో ఉంది. 2018లో వీరిద్దరి మధ్య తీవ్రమైన స్థాయిలో విభేదాలు చోటుచేసుకున్నాయి..నెస్ వాడియా తనను శారీరకంగా ఇబ్బంది పెట్టాడని..వాంఖడే మైదానంలో తనను అందరి ముందే తీవ్రంగా కొట్టాడని కేసు కూడా పెట్టింది.. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.. కాకపోతే క్రికెట్ మీద ఉన్న ప్రేమతో.. పంజాబ్ జట్టు మీద ఉన్న ఇష్టంతో ఆమె అందులోనే సహజమానిగా కొనసాగుతోంది. తాజాగా నెస్ వాడియా, మోహిత్ బర్మన్ తనకు తెలియకుండానే జట్టులోకి డైరెక్టర్ ను నియమించారని.. పంజాబ్ జట్టు మాతృ సంస్థ కేపిహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదని ప్రీతిజింటా కేసు పెట్టింది..
ఈ కేసు కొనసాగుతున్నప్పటికీ జట్టును ఎంకరేజ్ చేయడానికి ప్రీతి రెగ్యులర్ గా స్టేడియానికి వస్తున్నది. ప్లేయర్లను విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నది. ఇక ప్రతి అమెరికాకు చెందిన వ్యాపారవేత్త జెనీ గుడ్ ఇనఫ్ ను పెళ్లి చేసుకుంది. అమెరికాలోనే ఉండే ప్రీతి.. ఐపీఎల్ ప్రారంభమయ్యే ప్రతి సీజన్లో కొద్ది నెలలు ముందుగానే ఇండియాకు వస్తుంది.. ఆమె వచ్చిన ప్రతి సందర్భంలోనూ పంజాబ్ జట్టు ఓనర్లకు గొడవలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆమె పంజాబ్ జట్టులో ఉన్నతన వాటాను వదులుకోవడం లేదు. పైగా పంజాబ్ జట్టు తన ప్రాణమని.. క్రికెట్ అంటే ఇష్టమని.. చెబుతోంది. అయితే గురువారం జరిగే మ్యాచ్ అటు పంజాబ్ మాత్రమే కాదు.. బెంగళూరుకు కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ రెండు జట్లు గడచిన పదిని సంవత్సరాలుగా టైటిల్ కోసం కళ్లు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నాయి.