Kavitha education movement: అవి తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు. సాంస్కృతిక ఆయుధంతో కవిత ఉద్యమంలోకి వచ్చారు. నెత్తిన బతుకమ్మను ఎత్తుకొని.. గౌరమ్మను కీర్తిస్తూ.. తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను చాటిచెబుతూ అడుగులు వేశారు. చంటి బిడ్డ తల్లి అయినప్పటికీ ఉద్యమం ముందు వరుసలో నడిచారు. నాడు ఉద్యమం చేస్తున్న రోజులో ఎన్నడూ కూడా యువతను భావోద్వేగానికి గురి కావద్దని చెబుతూ ఉండేవారు కవిత.. చదువులను నిర్లక్ష్యం చేయొద్దని.. ఏనాటికైనా తెలంగాణ వస్తుందని.. తెలంగాణ రాష్ట్రంలోనే సమస్యలు తీరుతాయని స్పష్టంగా చెప్పేవారు.
వాస్తవానికి రాజకీయ నాయకులు యువతను తమ స్వార్థం కోసం వాడుకుంటారు. తమ రాజకీయ ప్రాపకం కోసం ఉపయోగించుకుంటారు. కానీ కవిత అలా కాదు. అలాంటి పని కవిత ఎన్నడూ చేయలేదు. అందువల్లే ఆమెను యువత విపరీతంగా ఆరాధిస్తూ ఉంటుంది. ఇటీవల జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అనే కార్యక్రమం నిర్వహిస్తే దానికి వేలాదిమందిగా యువత హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో కవిత చెప్పిన మాటలన్నిటినీ శ్రద్ధగా విన్నారు. రాజకీయం మాత్రమే కాదు, నాయకత్వం అంటే ఏమిటో కవిత వివరించిన తీరుకు యువత ఫిదా అయ్యారు. రాజకీయాలు అంటేనే విరక్తి కలుగుతూ.. రాజకీయ నాయకులు అంటేనే హేయమైన భావం విస్తరించిన నేటి రోజుల్లో కవిత మాటలను యువత శ్రద్ధగా వినడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే ఆ మాటల్లో రాజకీయాల్లోకి రావాలని గాని.. ఒకరి మీద పెత్తనం సాగించాలని కానీ కవిత చెప్పలేదు. జస్ట్ సమాజం కోసం ఎంతవరకు అయితే అంతవరకు చేయడమే మనిషి నైజం అని కవిత చెప్పిన మాటలు యువతను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అందువల్లే కవిత నేడు తన పూర్వ రాజకీయ క్షేత్రం నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా ఇంతమంది ఆమెను ఆరాధిస్తున్నారు.
ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఫీజుబకాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. అటు స్థానిక సమస్య కూడా విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఇవే విషయాలను కవితంగా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నారు.. తన సామాజిక మాధ్యమాల వేదికగానే ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో కలిసిన ఆ ఏడు మండలాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కవిత అనేక సందర్భాల్లో చెప్పారు. ఇటీవల భద్రాచలంలో పర్యటించినప్పుడు కూడా ఆ ఏడు మండలాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే దానికోసం తాను ఉద్యమం చేస్తానని కూడా ప్రకటించారు.
ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ కవిత తగ్గడం లేదు. తను శాసనమండలి సభ్యురాలుగా ఉన్నప్పుడు.. అనేక పర్యాయాలు విద్యార్థుల ఫీజు కష్టాల గురించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని.. ఎందుకంటే విద్యార్థులు చదువులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆమె శాసనమండలిలో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇటీవల కాలంలో విద్యార్థుల సమస్యల గురించి ఈ స్థాయిలో అటు అధికార పక్షంగాని.. ఇటు ప్రతిపక్షం గాని మాట్లాడలేదు. పైగా రాజకీయంగా వాడుకోవడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా కవిత కేవలం విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడారు. వాస్తవానికి రాజకీయ నాయకులు ఎంత మంది అయినా ఉండవచ్చు. వారి రాజకీయాల కోసం ఏమైనా చేస్తూ ఉండవచ్చు. కానీ ప్రజల బాగు కోసం పనిచేసేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ జాబితాలో కవిత ముందు వరుసలో ఉంటారు. తదుపరి రాజకీయ క్షేత్రం ఎలా నిర్మించుకుంటారు.. ఎలాంటి రాజకీయాలను ఎంచుకుంటారు.. అనే విషయాలను పక్కన పెడితే ఇప్పటివరకు అయితే యువత విషయంలో తిరుగులేని ఉద్యమాన్ని చేస్తున్నారు కవిత. భవిష్యత్తు కాలంలో ఆ యువతే కవితకు అండా దండా