Kavitha : నీటిపారుదల శాఖ మాజీమంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడిపై బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కవిత తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పార్టీలో కోటరీలు ఉన్నాయని.. ఆ కోటరీలకు వీళ్లిద్దరే బలమైన నాయకత్వం వహిస్తున్నారని కవిత ఆరోపించారు. వారిద్దరి వల్లే పార్టీలో పరిస్థితి దారుణంగా మారిపోయిందని.. అంతర్గత ప్రజాస్వామ్యం లేదని కవిత మండిపడ్డారు. అంతేకాదు తన లేఖలు లీక్ కాక ముందుకు జరిగిన ఒక సంఘటనను ఆమె బయటికి వెల్లడించారు.
కవిత కార్మిక దినోత్సవం రోజు సామాజిక తెలంగాణ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆమె సొంతంగా పార్టీ పెడుతున్నారని హరీష్ రావు, సంతోష్ రావు బయటికి లీక్ చేశారని.. మీడియాలో తన మీద వ్యతిరేకంగా వార్తలు రాయించారని కవిత ఆరోపించారు. అంతేకాకుండా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వ్యవహరించాలని జాగృతి అధినేత్రి మండిపడ్డారు.. పార్టీలో పరిస్థితి బాగోలేదని.. తనపై విష ప్రచారం జరుగుతోందని చెప్పినప్పటికీ కేటీఆర్ తనతో మాట్లాడలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
103 రోజులైంది
“నాపై విష ప్రచారం జరుగుతోంది. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారు. నా పార్టీ ఆఫీస్.. నా తెలంగాణ భవన్లో కి వెళ్లి ఈ విషయం చెప్పాను. అప్పుడు బాధ్యత కలిగిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పట్టించుకోవద్దా.. బేటా ఎందుకు బాధ పడుతున్నావ్.. ఏం కాదు నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పొద్దా.. ఇవాల్టికి 103 రోజులైంది రామన్న.. గడ్డం పట్టుకుని.. చేయి పట్టుకుని అడుగుతున్న.. కెసిఆర్ కుమార్తె కే ఈ పరిస్థితి ఉంటే.. మన పార్టీలో సామాన్య మహిళా కార్యకర్త పరిస్థితి ఏమిటి.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే న్యాయం జరుగుతుందా? ఇదే ప్రశ్న నేను అడుగుతా ఉన్న.. నిన్న సస్పెండ్ చేసిన తర్వాత నాకు సంతోషం అనిపించింది. పార్టీ చరిత్రలో తొలిసారి ఐదుగురు మహిళల వచ్చి నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇదే నేను కావాలని కోరుకుంటున్నా. పార్టీలో అధ్యక్షుడు నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు యాక్సిస్ ఉండాలని భావిస్తున్నా. నావల్ల అది జరిగింది.. సంతోషం అనిపిస్తోందని” కవిత వ్యాఖ్యానించారు.
పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఏం చేస్తున్నారు..
“పార్టీలో ఇంతటి దారుణమైన పరిస్థితి ఏర్పడినప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ కుమార్తెకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే న్యాయం జరగడం లేదు. అలాంటప్పుడు మిగతా వారికి మాత్రం న్యాయం ఏం జరుగుతుంది.. ఇదంతా సరైన విధానం కాదు కదా.. ఇలానే ఉంటే పార్టీ ఏం బాగుపడుతుంది.. ఇప్పుడు పార్టీని పునర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది కదా.. బ్లడ్ రిలేషన్ ఉన్న మహిళ పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా వారికి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని” కవిత పేర్కొన్నారు.
LIVE: Addressing media https://t.co/zb9ibixsiX
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 3, 2025