Kavitha Clean Chit Delhi Liquor Case: ఢిల్లీ కోర్టు లిక్కర్ కేసులో కవితమ్మకు క్లీన్ చిట్ ఇవ్వగానే ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుందనుకుంటే.. అబ్బే! ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పాపం అన్న కేటీఆర్ ‘చెల్లీ.. ఆ లిక్కర్ కేసు వల్లే కదా మనం ఓడిపోయాం’ అని జాలిగా ట్వీట్ చేస్తే, చెల్లెమ్మ కవితమ్మ మాత్రం ‘నా మీద వేస్తావా ఆ నింద? అసలు ఓడింది ఆ కేసు వల్ల కాదు, మీ అహంకారం వల్ల!’ అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు.దీనితో ‘కారు’ పార్టీలో ఇప్పుడు ‘నిప్పు’ రాజేసుకున్నట్లైంది.
కవితమ్మ కౌంటర్లో హైలైట్స్
జైలులో ఉండగా.. ‘నేను జైలులో ఉంటే, ఆ సోషల్ మీడియా టీమ్ ఏం చేసింది? నా క్యారెక్టర్ ని చంపేశారు!’ అని కవితమ్మ ఆవేదన. ‘ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోండి. న్యాయస్థానం తీర్పును మీ స్వలాభానికి వాడుకోవద్దు.’ అని కేటీఆర్‌కి క్లాస్ పీకారు. ‘నా మీద పెట్టిన కేసులు వేరు, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత వేరు’ అని కుండబద్దలు కొట్టారు.
Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!
ఈ ‘క్లీన్ చిట్’ వివాదంతో బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు “అక్కా.. తమ్ముడా” అని పిలుచుకుంటారో లేక “నీదా? నాదా?” అని కొట్టుకుంటారో చూడాలి. మొత్తానికి ప్రజల ముందు కారు పార్టీ ఫ్యామిలీ పరువు కాస్త బజారున పడినట్లైంది!
ఇప్పటివరకు బీఆర్ఎస్ అంటే ఫ్యామిలీ ఐక్యతకు మారుపేరు అనుకునేవారు. కానీ, ఈ ట్వీట్ల యుద్ధంతో ఆ ఇమేజ్ కాస్తా పటాపంచలైంది. క్లీన్ చిట్ వచ్చిన సంతోషంలో తన ఇమేజ్ను నిలబెట్టుకోవాలనుకున్న కవితమ్మకు, సొంత అన్న చేసిన వ్యాఖ్యలు ఆవేదనను కలిగించాయి. “న్యాయస్థానం తీర్పును మీ స్వలాభానికి వాడుకోవద్దు” అని అన్నకు చెల్లి ఇచ్చిన సలహా, ఇప్పుడు పార్టీ లోపల చర్చలకు దారితీసింది.
ఈ వివాదంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమలో తాము “చెల్లి.. అన్నా” అని మాట్లాడుకుంటారో, లేక “నీదా.. నాదా” అని తేల్చుకుంటారో చూడాలి.