HomeతెలంగాణKarimnagar Congress Internal Conflict: కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ముసలం.. రచ్చకెక్కిన విభేదాలు!

Karimnagar Congress Internal Conflict: కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ముసలం.. రచ్చకెక్కిన విభేదాలు!

Karimnagar Congress Internal Conflict: కాంగ్రెస్‌ అంటేనే కయ్యాల పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువ. ఒక నేత ఎదుగుదలను మరో నేత ఓర్వులేడు. ఒకరి ఆధిపత్యాన్ని మరోకరు సహించరు. ఎవరికి వారు గ్రూపులుగా ఉంటారు. అవసరమైతే అధిష్టానాన్ని కూడా బూతులు తిడతారు. తర్వాత కలిసే ఉంటారు. ఏమన్నా అంటే స్వేచ్ఛ, స్వాతంత్య్రం అని పెద్దపెద్ద మాటలు చెబుతారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీలో కొన్నాళ్లు కయ్యాలు కనిపించలేదు. కానీ ఆరు నెలలుగా లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా కరీనంగర్‌లో బిభేదాలు రచ్చకెక్కాయి. కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ఇన్‌చార్జి నియామకం వివాదం పార్టీ ఐక్యతను దెబ్బతీసింది. స్థానిక నేతల అసంతృప్తి, అధిష్ఠాన నిర్ణయాలపై బహిరంగ తిరస్కారం శ్రేణుల్లో గందరగోళాన్ని మురికి చేస్తోంది.

నియామకంతో వివాదం
వెలిచాల్‌ రాజేందర్‌ రావును కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడం పలువురు స్థానిక నాయకుల అభ్యంతరానికి దారితీసింది. సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు తమ పేర్లతో వినతిపత్రాలు సమర్పించారని, తమ సమ్మతి లేకుండానే జరిగిందని మండిపడ్డారు. సన్నాహక సమావేశాల్లోనే విభేదాలు బహిర్గతమై, గొడవల వరకు వెళ్లింది.

వెలిచాల టార్గెట్‌గా..
మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్‌లాంటి మునుపటి నాయకులు పార్టీ నాయకత్వంపై ఫైర్‌ అవుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్‌ ఇన్‌చార్జి వెలిచాల్‌ రాజేందర్‌ రావును లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో సహకారం లేకపోవడం, టికెట్‌ కేటాయింపుల్లో భేదం వంటి ఆరోపణలు ఉన్నాయి. డీసీసీ కార్యాలయంలో రహస్య సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మూడుముక్కలాట..
కరీంనగర్‌ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట జరుగుతోంది. గత మున్సిపల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 66 డివిజన్లలో కేవలం 14 సీట్లకే పరిమితమైంది. ఇన్‌చార్జి లేకపోవడం, జిల్లా అధ్యక్ష పదవి ఆలస్యం ఈ సమస్యలకు ఆధారం. మంత్రివర్గ విస్తరణలో కూడా స్థానికులకు ప్రాధాన్యత లేకపోవడంపై నిరాశ వ్యక్తమవుతున్నారు. ఈ వివాదం పీసీసీ స్థాయికి చేరి, సస్పెన్షన్‌ డిమాండ్లు ఉయరుతున్నాయి. ఎన్నికల విషయాల్లో పార్టీ బలం తగ్గుతున్న ఈ ప్రాంతంలో ఇది మరింత దెబ్బ తీస్తుంది.

అధిష్టానం త్వరగా స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించి, పునర్నియామకాలు చేయాలి. పారదర్శకత, స్థానిక ప్రాతినిధ్యం పెంచితే శ్రేణులు ఏకతాటిపై నడవవచ్చు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో మూడో స్థానానికి మాత్రమే పరిమితమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version