Kalvakuntla Kavitha: గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై విస్తృతంగా విచారణ నిర్వహించింది. అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు నుంచి మొదలుపెడితే మీడియా అధినేతల వరకు కూడా నోటీసులు ఇచ్చి.. వారందరి వాంగ్మూలాలు సేకరించింది. అయితే ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ.. ఈ వ్యవహారంపై జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే ఆమె ప్రకంపనలకు గురి చేసే విషయాలను చెప్పారు.
Also Read: చంద్రబాబు వల్ల మొంథా తుఫాను .. దానిని ఆపిన మగాడు జగన్.. ఆర్కే భలే పాయింట్ పట్టాడుగా..
కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జాగృతి కార్యకర్తలతోనే ఆమె ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారితో మాట్లాడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కవిత.. క్షేత్రస్థాయిలో తాను గుర్తించిన సమస్యలను బయటపెడుతున్నారు. ఇంతటితోనే ఆమె ఆగడం లేదు. గతంలో భారత రాష్ట్ర సమితిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు. తనకు అన్యాయం జరుగుతే పెద్దగా పట్టించుకునే దానిని కాదని.. అవమానం జరిగిందని.. తెలంగాణ ఆడబిడ్డగా బయటికి వచ్చానని.. అందువల్లే తాను మొహమాటం లేకుండా నిజాలు బయటపెడుతున్నానని కవిత పేర్కొన్నారు.
కవిత తన భర్త విషయం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తన భర్త ఫోన్ లో మాటలు కూడా దొంగ చాటుగా విన్నారని .. ఆయన ఫోన్ ను కూడా ట్యాపింగ్ కవిత ఆరోపించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరో మాత్రం కవిత బయట పెట్టలేకపోయారు. ఇదే విషయాన్ని విలేకరులు ప్రశ్నిస్తే కవిత సమాధానం దాటవేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వెనుక కేటీఆర్ ఉన్నాడని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా అప్పట్లో కేటీఆర్ కూడా తమ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారంటే అది రాజకీయ అవసరం. కానీ ఆయన సోదరి తన భర్తకి ఫోన్ ట్యాపింగ్ విషయాన్నీ బయట పెట్టడం.. నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తి ఇదంతా చేశాడని పరీక్షంగా వ్యాఖ్యానించడం.. తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది.