Kaleshwaram Project Controversy: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కాలేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కుంగిపోయాయి. అప్పట్లో ఈ వంతెన మీదుగా రాకపోకలను నిలిపివేశారు. ఆ తర్వాత మేడిగడ్డ విషయంలో కేంద్ర అధికారులు విచారణ సాగించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇటీవల ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీడియాకు లీక్ అయింది. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది.
Also Read: కవితకు ఇప్పటికిప్పుడు సొంత మీడియా, సోషల్ మీడియా చాలా అవసరం!
కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై స్టే ఇవ్వాలని కెసిఆర్, హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఎదుట కెసిఆర్, హరీష్ రావు తరఫున న్యాయవాదులు తమ వాదన వినిపించారు.. అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను ప్రవేశపెట్టకుండా ఉండాలని హైకోర్టును విన్నవించారు.. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కేసిఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఇటువంటి స్థితిలో తాము మధ్యంతర ఉత్తరంలో ఇవ్వలేమని స్పష్టం చేసింది. నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఇంకా 6 నెలల సమయం ఉందని.. అలాంటప్పుడు స్టే ఇవ్వాలని ఎలా అడుగుతారని పేర్కొంది. గులాబీ దళపతి, నీటిపారుదల శాఖ మాజీమంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాదు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తామని ప్రకటించింది.
Also Read: కేసీఆర్ ఉత్తర తెలంగాణకు.. రేవంత్ దక్షిణ తెలంగాణకు.. అభివృద్ధి అంతా అటేనా..?
హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కెసిఆర్, హరీష్ రావు ఉన్నట్టు సమాచారం. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పుడు ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.. మరోవైపు కాళేశ్వరం విషయంలో ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి ప్రజెంటేషన్ల మీద ప్రజెంటేషన్లు ఇచ్చింది. కాలేశ్వరంలో ఏ తప్పు జరగలేదని.. అడ్డగోలుగా ఎటువంటి నిర్మాణం చేపట్టలేదని.. ప్రతిదీ కూడా ఇంజనీర్ల ద్వారానే నిర్మించినట్టు ప్రజెంటేషన్లో హరీష్ రావు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాలేశ్వరం విషయంలో తప్పించుకోవాలని చూస్తున్నప్పటికీ హైకోర్టు తలంటిందని.. ఇప్పటికైనా హరీష్ రావు, కెసిఆర్ వాస్తవాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు..