Kadiyam Srihari: హస్తినకు కడియం శ్రీహరి.. కావ్య.. ఏం జరుగబోతోంది?

కడియం శ్రీహరికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు లెక్చరర్ గా పనిచేసేవారు. తన రాజకీయ ప్రస్థానాన్ని టిడిపి నుంచి శ్రీహరి ప్రారంభించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 29, 2024 4:16 pm

Kadiyam Srihari

Follow us on

Kadiyam Srihari: రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తారో, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకున్నారు తెలియదు గాని.. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అనేక కుదుపులకు లోనవుతోంది. వరంగల్ భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థిని కడియం రాసిన లేఖతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. శుక్రవారం కడియం శ్రీహరి, తన కూతురు కావ్య తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.. ఈరోజు లేదా రేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో కావ్యకు లేదా కడియం శ్రీహరికి వరంగల్ పార్లమెంట్ సీటు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కావ్యకు టికెట్ ఇస్తారని ఓవర్గం, లేదు శ్రీహరికే టికెట్ దక్కుతుందని మరో వర్గం ప్రచారం చేసుకుంటుండడంతో టికెట్ ఎవరికి దక్కుతుందనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. ఒకవేళ కావ్యకు టికెట్ ఇస్తే శ్రీహరికి పెద్దగా ఇబ్బంది ఉండదు. శ్రీహరికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఆయన స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. పైగా తన కూతురిని తన స్థాయి లో చూడాలని శ్రీహరి భావిస్తున్న నేపథ్యంలో.. కావ్య కే టికెట్ దక్కి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం

కడియం శ్రీహరికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు లెక్చరర్ గా పనిచేసేవారు. తన రాజకీయ ప్రస్థానాన్ని టిడిపి నుంచి శ్రీహరి ప్రారంభించారు. టిడిపిలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తాటికొండ రాజయ్యకు శ్రీహరికి మధ్య వివాదం తలెత్తినప్పుడు.. కేసీఆర్ శ్రీహరి వైపే ఉన్నారు. అంతేకాదు రాజయ్యను కాదని స్టేషన్ ఘన్ పూర్ టికెట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీహరికే కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అప్పట్లోనే తన కూతురికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని శ్రీహరికి వరకే కేసీఆర్ తల ఊపారు. ఇందులో భాగంగానే వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ ను పక్కనపెట్టి కావ్యకు టికెట్ ఇచ్చారు. కావ్య కూడా ప్రచారం ప్రారంభించారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు గానీ పార్టీ పరిస్థితి బాగోలేదంటూ వరంగల్ టికెట్ ను కావ్య నిరాకరించింది. తను పోటీ చేయబోనంటూ స్పష్టం చేసి ఒక లేఖ రాసింది. అందులో భారత రాష్ట్ర సమితి చేస్తున్న తప్పులను, గతంలో చేసిన తప్పులను ప్రస్తావించింది. దీంతో ఒకసారిగా ఆ లేఖ తెలంగాణ రాజకీయాల్లో కలకలాన్ని సృష్టించింది.

టికెట్ ఎవరికంటే?

రాజీనామా ప్రకటించిన వెంటనే కడియం కావ్య, కడియం శ్రీహరి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం లేదా శనివారం వారిద్దరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. విశ్వసనీ వర్గాల సమాచారం ప్రకారం కావ్య కే వరంగల్ పార్లమెంట్ టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కడియం శ్రీహరి మాత్రమే కాకుండా సుమారు వందమంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. మొత్తానికి కడియం కావ్య ఉదంతంతో భారత రాష్ట్ర సమితికి బలంగా ఉన్న వరంగల్ జిల్లా లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలాంటి పరిస్థితులను భారత రాష్ట్ర సమితి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక ఇప్పటికే స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితికి దూరమయ్యారు. ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటిదాకా శత్రువులుగా ఉన్న శ్రీహరి, రాజయ్య.. ఒకటే పార్టీలో ఉండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిని వరంగల్ జిల్లాలో కేసీఆర్ ఎలా కాపాడుతారో వేచి చూడాల్సి ఉంది.