https://oktelugu.com/

KA Paul: పొలిటికల్ కమెడియన్ అంటావా? రిపోర్టర్ పై కేఏ పాల్ ఫైరింగ్.. వైరల్ వీడియో

కేఏ పాల్ ప్రతి విషయాన్ని కూడా తనకి అనుకూలంగానే మాట్లాడుతాడు. నోరు తిప్పుకోకుండా.. ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా మాట్లాడేస్తూ ఉంటాడు.. అందుకే కేఏ పాల్ తో మాట్లాడాలంటే విలేకరులు ఒకింత భయపడుతుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 7, 2023 / 12:43 PM IST

    KA Paul

    Follow us on

    KA Paul: రాజకీయాలంటే మరి అంత సీరియస్ గా ఉండాలని లేదు.. ఎదుటి పార్టీ నాయకులపై సూటిగా విమర్శలు చేయాలని కూడా లేదు. రాజకీయాల్లో కూడా కామెడీ పండించవచ్చు. చూస్తున్న జనాలను కడుపుబ్బా నవ్వించవచ్చు. సినిమాల కంటే మించి జనాలు టీవీలకే అతుక్కునేలా చేయవచ్చు. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నప్పుడు దృష్టి మొత్తం కేంద్రీకరించేలా చేయవచ్చు. ఇలా చేసినవాడు కేఏ పాల్. రాజకీయాల్లో ఎవరికి సాధ్యం కానీ రికార్డులను అతడు సాధించాడు. ఎవరికీ సొంతం కానీ వ్యూయర్ షిప్ అతడు సాధించాడు.. అంతేకాదు లైవ్ డిబేట్లో కూడా నవ్వులు పూయించాడు. కేటీఆర్ లాంటి వర్తమాన రాజకీయ నాయకులతో కూడా శభాష్ అనిపించుకున్నాడు. అటువంటి కేఏ పాల్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటాయి. తాజాగా ఒక విలేకరితో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    నన్ను అలా అంటావా

    కేఏ పాల్ మాట్లాడే మాట, అతడి వ్యవహార శైలి చాలా చిత్రంగా ఉంటాయి. ఎదుటివారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆయన టాకిల్ చేసే విధానం కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి కేఏ పాల్ అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో రాజకీయ ప్రయోగం చేశారు. ఇది విఫలమైనప్పటికీ ఆయన తన తోవ విడిచిపెట్టలేదు. తనను తాను రాజకీయ సంభూతుడిగా పేర్కొనడం ఏమాత్రం తగ్గించలేదు. కెసిఆర్ పార్టీని తన పార్టీలో విలీనం చేయాలి అంటాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనతో కలిసి పని చేయాలి అంటాడు. చంద్రబాబు సారీ చెప్పి తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించాలి అంటాడు. జగన్మోహన్ రెడ్డికి పాలించడం చేతకావడం లేదని, తనకు ఆ బాధ్యతను అప్పగించాలి అంటాడు. అమెరికా అధ్యక్షుడుని కలిసాను అంటాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కోట్లల్లో ఫండ్స్ తీసుకొస్తా అని హామీ ఇస్తాడు. ఇవేవో గాలి కబుర్లు అనుకుంటే పాల్ వెంటనే తిరగబడతాడు.. ఇలాంటి మాటలను విన్న ఓ విలేఖరి కేఏ పాల్ ను పొలిటికల్ కమెడియన్ అని సంబోధించాడు. దానికి వెంటనే పాల్ కు కోపం వచ్చింది. ప్రశ్నలు సంధిస్తున్న విలేకరిని స్టూ** అని తిట్టేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.

    కోపం ఎక్కువే

    కేఏ పాల్ ప్రతి విషయాన్ని కూడా తనకి అనుకూలంగానే మాట్లాడుతాడు. నోరు తిప్పుకోకుండా.. ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా మాట్లాడేస్తూ ఉంటాడు.. అందుకే కేఏ పాల్ తో మాట్లాడాలంటే విలేకరులు ఒకింత భయపడుతుంటారు. సాధారణంగా ఇలాంటి భయాన్ని వారు అధికారంలో ఉన్న నాయకుల ముందు ప్రదర్శిస్తుంటారు. కానీ ఎలాంటి అధికారంలేని పాల్ విలేకరులలో భయాన్ని కలగజేశాడు అంటే మామూలు విషయం కాదు. పైగా విలేకరులకు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా తను చెప్పాల్సింది చెప్పేస్తాడు. ఆ తర్వాత మీ కర్మం అంటూ వదిలేస్తాడు.. పాల్ వీడియోలు అందుకే జనం విరగబడి చూస్తుంటారు. టీవీ చానల్స్ కు కూడా వ్యూయర్ షిప్ ముఖ్యం కాబట్టి..పాల్ తో ఇంటర్వ్యూలు చేసేందుకు ఇష్టపడుతుంటాయి. ఆమధ్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా పాల్ ఇదేవిధంగా సమాధానం చెప్పాడు. దీంతో రాధాకృష్ణకు తల బొప్పి కట్టినంత పనైంది. కాకపోతే ఈ ఇంటర్వ్యూను యూట్యూబ్లో లక్షలాదిమంది వీక్షించారు.. ఈ ఇంటర్వ్యూ చూసి చాలా నవ్వుకున్నానని కేటీఆర్ ఆమధ్య చెప్పడం.. కూడా వేమూరి రాధాకృష్ణ చేస్తున్న ఇంటర్వ్యూలో పేర్కొనడం విశేషం. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా గెలుస్తామనే ధీమా మాత్రం పాల్ లో ఎప్పటికీ ఉంటుంది. పొలిటికల్ కమెడియన్ అంటూ ఉంటారు కానీ.. కొందరి చేష్టల వల్ల ఆయన అలా అయిపోయాడని చాలామందికి తెలియదు. పాపం కే ఏ పాల్!