Tollywood :సినీ ఇండస్ట్రీ ప్రతీ చిన్న దానికి సాఫ్ట్ టార్గెట్ అవ్వాల్సిందేనా..?, సినీ నటులకు ప్రభుత్వాల వద్ద తగిన గుర్తింపు రావడం లేదా?, ఎందుకు ప్రతీసారీ ప్రభుత్వాలకు భయపడుతూ సినీ ఇండస్ట్రీ బ్రతకాలి అనే వాదన ఇప్పుడు సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తుంది. కేవలం ఒక్క వ్యక్తి చేసే తప్పు, లేదా పొరపాటుకు ఇండస్ట్రీ మొత్తం అనుభవించాలి అనే ధోరణితోనే ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు, మాజీ సీఎం జగన్ హయాం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ సర్వనాశనమైన సంగతి తెలిసిందే. టికెట్ రేట్స్ , బెన్ఫిట్ షోస్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, ఇండస్ట్రీ ని పాతాళ లోకంలోకి తొక్కేసాడు జగన్. అది కూడా కేవలం ఒక వ్యక్తి మీద కోపం తో, ఆ వ్యక్తి ఎవరూ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అందులోనూ ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ఉండడంతో సినీ ఇండస్ట్రీ కి కావాల్సిన వరాలు దొరుకుతున్నాయి.
పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రతీసారి ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా, బడ్జెట్ కి తగ్గట్టు టికెట్ రేట్స్ ని పెంచుకునే వెసులుబాటు కల్పిస్తానని, ఒక ప్రణాళికతో సినీ పెద్దలందరూ మాట్లాడుకొని నా వద్దకు రావాల్సిందిగా ఆయన కోరాడు. ఆంధ్ర ప్రదేశ్ లో సినీ పరిశ్రమ ప్రస్తుతం మహర్దశలో కొనసాగుతుంది. కానీ తెలంగాణ లో ఇటీవల సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన కారణంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, సినీ ఇండస్ట్రీ లో త్వరలో రాబోతున్న సినిమాలకు టికెట్స్ హైక్స్, బెనిఫిట్ షోస్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించడం వంటివి సినీ ఇండస్ట్రీ ని ఉలిక్కిపడేలా చేసింది. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన సమస్య, ఇప్పుడు తెలంగాణాలో ఏర్పడిందే, వందల కోట్ల బడ్జెట్స్ పెట్టి సినిమాలను తీస్తున్నాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి దేవుడా అని నిర్మాతలు రోదిస్తున్నారు.
తెలుగు సినిమా సత్తా ప్రపంచం మొత్తం చూస్తున్న ఈ రోజుల్లో, ఒకటి రెండు ఘటనలను ఆధారంగా తీసుకొని సినీ ఇండస్ట్రీ మొత్తం ఇక ఇబ్బంది పడాల్సిందే అంటే ఎంతవరకు సబబు అని సోషల్ మీడియాలో కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి తో చర్చలు జరపడానికి రెండు మూడు రోజుల్లో సినీ పరిశ్రమకి సంబంధించిన పెద్దలందరూ వెళ్తున్నారు. కచ్చితంగా సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది. కానీ ఎన్నాళ్ళు ఇలా?, గతంలో కూడా మాజీ సీఎం జగన్ వద్దకు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్,రాజమౌళి వంటి దిగ్గజాలు వెళ్లి టికెట్ రేట్స్ పెంపు కోసం బ్రతిమిలాడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహా పరిస్థితి తెలంగాణాలో ఏర్పడింది. ఏ చిన్న పొరపాటు జరిగినా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడాల్సిందేనా..?, మన తెలుగోడి ఖ్యాతి ప్రపంచం నలుమూలలకు విస్తరింపచేసిన పరిశ్రమలో సినీ పరిశ్రమ ఒకటి. అలాంటి పరిశ్రమని టార్గెట్ చెయ్యొద్దు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ వేడుకుంటున్నారు.