https://oktelugu.com/

Nizam Museum: ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే మన హైదరాబాదీ నిజాం మ్యూజియం.. లోపల ఏముందో తెలుసా?

ఆరో నిజాం ప్యాలెస్‌ను స్థానికంగా పురానీ హవేలీ అని పిలుస్తారు. ఈ హవేలీలోని ఒక భవనాన్ని మ్యూజియంగా మార్చారు. అదే నిజాం మ్యూజియం. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వార్‌డోబ్‌ఈ మ్యూజియంలో ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 20, 2024 / 10:45 AM IST

    Nizam Museum

    Follow us on

    Nizam Museum: చారిత్రక నగరం మన భాగ్యనగరం. నగరంలో ఎక్కడ చూసినా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. నాటి చరిత్రను మన కళ్ల ముందు ఉంచుతాయి. గోల్కొండ, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్‌తోపాటు వందలాది చారిత్రన ప్రాంతాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇక మ్యూజియంల విషయానికి వస్తే.. సాలార్జంగ్, స్టేట్‌ మ్యూజియం చాలా మందికి తెలుసు. కానీ ఆరో నిజాం నివాసం, ఏడో నిజాం పుట్టిన ప్యాలెస్‌ గురించి కొందరికే తెలుసు.

    రాజ భవనం మ్యూజియంగా..
    ఆరో నిజాం ప్యాలెస్‌ను స్థానికంగా పురానీ హవేలీ అని పిలుస్తారు. ఈ హవేలీలోని ఒక భవనాన్ని మ్యూజియంగా మార్చారు. అదే నిజాం మ్యూజియం. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వార్‌డోబ్‌ఈ మ్యూజియంలో ఉంది. ఆరో నిజాం కాలంలో ఈ వార్‌డోబ్‌ 176 ఫీట్ల వెడల్పుతో రెండు ఫ్లోర్లతో నిర్మించారు. అందులో నవాభులు, రాణులు, యువరాణుల డ్రెస్సులు చూస్తే కళ్లు జిలేల్‌మంటాయి. ఇక 1911లో రాజైన అలీఖాన్‌ 1936 నాటికి పాలన మొదలు పెట్టి పాతికేళ్లెంది. ఈ సందర్భంగా 1937 ఫిబ్రవరి 13న పబ్లిక్‌ గార్డెన్‌ జూబ్లీహాల్‌లో సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు చేశారు. ఆ వేడుకలప్పుడు ఆయనకు చాలా బహుమతులు వచ్చాయి. 2000 సంవత్సరంలో వాటిని పురానీ హవేలిలో ‘నిజాం మ్యూజియం’ ఏర్పాటు చేశారు. దీంతో ఈ మ్యూజియం నగరంతోపాటు దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటోంది.

    ప్రత్యేకమైన లిఫ్ట..
    ప్రస్తుతం మనం పెద్ద పెద్ద భవనాల్లో లిఫ్ట్‌లు చూస్తున్నాం. కానీ నిజాం కాలంలో కూడా లిఫ్టులు ఉండేవి. నాటి లిఫ్ట్‌నుతాళ్లుకట్టి లాగేవారు. అలాంటి లిఫ్టు ఈ మ్యూజియంలో చూడొచ్చు. నవాబు లిఫ్ట్‌లో ఎక్కగానే తాడుతో లాగేవాళ్లు. దీంతో పై అంతస్తుకు వెళ్లేవాడు.

    ఆహారం పరీక్ష..
    ఇక నాడు రాజుల ప్రాణాలకు ఎప్పుడు.. ఎలాంటి ముప్పు ఉంటుందో తెలియదు. అందుకే తినే ఆహారం కూడా పరీక్షించేవారు. అయితే నాడు టెక్నాలజీ లేకపోవడంతో వారికి తెలిసిన పద్ధతిలో పరీక్షించేవారు. ఆహారాన్ని సిలిగాడ్‌ ప్లేట్‌లో పెట్టేవారు. అందులో విషం ఉంటే.. ప్లేట్‌ రంగు మారడమో లేదా పగిలిపోవడమే జరిగేది. ఇక ఇప్పుడు చాలా మంది కాఫీ కప్పులపై తమ ఫొటో వేయించుకుంటున్నారు. కానీ, ఈ పరిజ్ఞానం నిజాం నాడే ఉపయోగించారు. సీసాలపై ఆయన చిత్రాలు ముద్రించారు.

    అంతా బంగారమే
    మనం కొత్తగా బిల్డింగ్‌ కట్టాలంటే.. ముందుగా ఇంజినీర్‌ ప్లాన్, నమూనా తయారు చేయిస్తాం. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో నమూనాలు తయారు చేస్తున్నారు. కానీ, నాడు బంగారం, వెండితో బిల్డింగ్‌ నమూనాలు తయారు చేసేవారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ నమూనాను వంద కిలోల వెండితో తయారు చేయించారు. ఇక నాంపల్లి రైల్వేస్టేషన్‌ నమూనాను 30 కిలోల వెండితో తయారు చేశారు. జూబ్లీ హాల్‌ నమూనాను పూర్తిగా బంగారంతో తయారు చేశారు. ఇలాంటి అనేక నమూనాలు మ్యూజియంలో ఉన్నాయి. మ్యూజియంలో ఉన్న బంగారు లంచ్‌ బాక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని రెండున్నర కిలోలతో తయారు చేయించారు.

    త్రీడి చిత్రం..
    ప్రస్తుతం త్రీడీ కాలం. అయినా అందరికీ అందుబాటులోకి రాలేదు. కానీ నిజాంకాలంలో రాజుల నిలువెత్తు చిత్రపటాలను త్రీడి గీశారు, చౌమహల ప్యాలెస్లో అజాంజాహీ బహదూర్‌ చిత్రపటాన్ని ఎటువైపు నుంచి చూసినా.. బహదూర్‌ మనలేనే చూసినట్లు కనిపిస్తుంది.

    ఇంకా ఎన్నో ప్రత్యేకతలు..
    నిజాం మ్యూజియంలో ఇంకా ఎన్నో ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి. కరీంనగర్‌ కళాకారులు నిజాంకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఏనుగుపై మావటివాడు బొమ్మ ఎంతో స్పెషల్‌. పాల్వంచ రాజు వెండితో చేయించిన పొన్న చెట్టుపై కృష్ణుడి విగ్రహం, చెట్టుకింద గోపికలు నాట్యం చేస్తున్న ప్రతిమ, వజ్రాలు పొదిగిన టీకప్పులు, వజ్రాలు, పచ్చలతో తయారు చేసిన థర్మామీటర్లు ఆకట్టుకుంటాయి. మీర్‌ అలీఖాన్‌ ఊగిన వెండి ఊయల, నిజాం కొడుకులు ముకరంజా, ముఫకంతా బహదూర్‌తోపాటు ఆయన కోడళ్లు మైన్స్‌ దురైషహ్కర్, ప్రిన్స్‌ నిలోఫర్‌ల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.