Nijayithi Gudem: అబద్ధం.. ఈ పదం అంటే ఒకప్పుడు కష్టంగా భావించే వారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అబద్ధమే అందరికీ అవసరం. తమ అవసరాలు తీరాలంటే.. అబద్దం ఆడాల్సిందే. సందర్భానుసారమైనా.. వ్యక్తిగత అవసరాల కోసమైనా.. కుటుంబ అవసరాల కోసమైనా అబద్దం ఆడాల్సిందే. అబద్దం ఆడని రోజు అనేది ఈ రోజుల్లో లేదు. ప్రతి ఒక్కరూ.. ప్రతీరోజు అబద్దం ఆడకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఆపదలో… ప్రాణాపాయం ఉన్నప్పుడు అబద్దం ఆడడం తప్పు కాదని చట్టం కూడా చెబుతుంది. కానీ అబద్దమే జీవితంగా బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మారుతన్న కాలం.. మారుతున్న పరిస్థితులు.. మారుతున్న అవసరాలు.. కూడా మనల్ని అబద్దం ఆడేలా చేస్తున్నాయి. కానీ ఈ రోజుల్లో కూడా అబద్దం ఆడకుండా ఉంది ఆ గ్రామం.. నిజమే. ఒకరో ఇద్దరో అబద్దాలు ఆడకపోవడం కాదు.. ఊరు ఊరంతా అబద్దాలు ఆడదు. అంతా సత్య హరిచంద్రులే. ఎవరూ ఆ ఊరిలో అబద్దం ఆడరు. అందుకే ఆ ఊరి పేరే నిజాయితీ గూడెంగా మారింది. తెలంగాణ అంటేనే కలలకు ప్రసిద్ధి.. ఈ తెలంగాణను కుతుబ్‌షాహీల అజం జాహీలు, నిజాం ప్రభువులు కాకతీయులు పరిపాలించారు. వారి పలనలో ఎవరైతే సమాంతరాజులు ఉంటారో వారి పేర్ల మీదగా కొన్ని జిల్లాల పేర్లు గ్రామాల పేర్లు కూడా వెలిశాయి.. ఇందులోనే భాగంగా తెలంగాణ కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలంలోని నిజాయితీ గూడెం అనే గ్రామం ఉంది. ఊరుకు చుట్టుపక్కల పచ్చని పొలాలు,నాణ్యమైన రోడ్లు, తాగునీరు, సాగునీరు పుష్కలంగా ఉండడంతో భూమికి పచ్చని రంగు వేసినట్టు ఊరంతా పచ్చగా కళకళలాడుతుంది. ఈ గ్రామాన్ని అప్పుడు నిజాం ప్రభు పరిపాలించే వారు. ఈ ఊరు గ్రామస్తులు అందరూ అప్పుడు నిజాయితీగా ఉండేవారట. అందుకే ఈ గ్రామం పేరు నిజాయితీ గూడెం అని పేరు పెట్టారని గ్రామస్తులు అంటారు. ఈ ఊరి పొరుగు గ్రామాల పేర్లు కూడా ఖాదరగూడెం, వంకాయ గూడెం, అని పేర్లు ఉన్నాయి.
అన్నీ నిజాయితీగానే..
ఈ గ్రామ ప్రజలు నాడు అబద్దాలు ఆడకపోవడం ఒక విశేషం అయితే.. అప్పులు కట్టడంలోనూ నిజాయితీగానే ఉండేవారట. అలా కూడా ఈ ఊరికి నిజాయితీ గూడెం అని పేరు పెట్టారని స్థానికులు చెబుతారు. ఒక బ్రాహ్మణుడు చెప్పిన కథ ప్రకారం ఒక మహిళ స్నానం చేసేందుకు వెళ్లినప్పుడు ఆమె పుస్తెల తాడు తీసి ఒక మేకుకు తగిలించి వెళ్లి వచ్చేలోపు ఆ పుస్తెలతాడు మొత్తం చెదలు పట్టిపోయిందట అలా ఊరికి అప్పటి నుంచి ఊరికి ఎలాంటి అంటువ్యాధులు రావు. అలాగే ఊళ్లో రాళ్ల వర్షం కూడా పడదని శాస్త్రాలు చెప్పాయిని గ్రామ కుల పెద్ద చెబుతున్నారు.. ఇలా గ్రామానికి అన్ని రకాలుగా మేలు జరగడంతో నిజాయితీ గూడెంగా పెరుగంచింది.
ఎవరిపని వారిది..
ఇక ఈ గ్రామంలో ఎవరి పని వారు చేసుకుంటారు. ఇప్పటికీ గ్రామంలో చాలా మంది నిజాయితీగా పని చేసుకుంటూ పోతారట. ఇప్పటి తరం వాళ్లు కూడా మద్యం మత్తు కూడా చాలా దూరంగా ఉంటారు. ఎవరో కొందరు మాత్రమే మద్యం తీసుకుంటారు తప్ప చాలామంది మద్యానికి దూరంగా ఉంటున్నారు.. అలాగే ఊరుకు చుట్టుపక్కల పచ్చని పొలాలు, నాణ్యమైన రోడ్లు, తాగునీరు, సాగునీరు పుష్కలంగా ఉండడంతో భూమికి పచ్చని రంగు వేసినట్టు ఊరంతా పచ్చగా కళకళలాడుతుంది.. ఊరిలో కూడా చాలామంది ఎక్కువ చదువుకున్న వాళ్లే ఉండడం విశేషం.. అలాగే ఇంకా కొంతమంది వ్యవసాయం ఇతర పనులు చేసుకుంటూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు.