Telangana : కెసిఆర్ అన్నది నిజమే.. మనది దేశంలోనే రెండో ధనిక రాష్ట్రం.. కేంద్రం చెప్పిన ధనిక, పేద రాష్ట్రాలివీ

" తెలంగాణ ధనిక రాష్ట్రం. బంగారు తెలంగాణ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. కోటి ఎకరాల మాగాణాను రూపొందించాం. దేశానికే తెలంగాణ అన్నం పెడుతోంది. అంతటి కరోనా కాలంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది" ఇలానే మాట్లాడేవాడు కేసీఆర్.

Written By: NARESH, Updated On : September 18, 2024 11:15 pm

India's Richest and Poorest States : telangana is the second Richest state in the country

Follow us on

India’s Richest and Poorest States : మైకు దొరికితే చాలు బంగారు తెలంగాణ అని చెప్పేవాడు. బంగారు తెలంగాణ దిశగా తాము కృషి చేశామని పదేపదే చెప్పుకునేవాడు. తొలి ఐదేళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు కూడా బంగారు తెలంగాణ అనే నినాదాలు కేసీఆర్ వదిలిపెట్టలేదు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు విడిచిపెట్టలేదు. ఇక నమస్తే తెలంగాణ సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోతురాజు లాగా చర్నాకోల్ పట్టుకొని కొట్టుకునేది.. అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ వరకు అందరు నాయకుల విమర్శించేవారు. సరిగ్గా జీతాలు కూడా ఇవ్వడం లేదు, అప్పులు లేకుండా పాలన సాగడం లేదు, కాలేశ్వరం కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడని కెసిఆర్ మీద విపక్ష పార్టీలు విమర్శలు చేసేవి. అవి ఎలా ఉన్నప్పటికీ కెసిఆర్ అండ్ కో బంగారు తెలంగాణ ప్రచారాన్ని వదిలిపెట్టేది కాదు. దానికి రాష్ట్రమని ట్యాగ్ లైన్ ను విడిచిపెట్టేది కాదు. అయితే అప్పట్లో కెసిఆర్ అన్న మాటలను చాలామంది వక్రీకరించేవారు. కానీ ఇన్నాళ్లకు కేసీఆర్ చెప్పిన మాటలు నిజమయ్యాయి . ఆయన అధికారంలో లేకపోయినప్పటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమని తేలిపోయింది.

telangana

కేంద్రం జాబితా లో ఏముందంటే

మనదేశంలో రాష్ట్రాలు, వాటి ఆర్థిక పరిస్థితులపై కేంద్రం ఒక నివేదిక విడుదల చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి దీనిని వెల్లడించింది. దాని ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ, పది సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు దేశంలో తొలి 5 ధనిక రాష్ట్రాలుగా నిలిచాయి. ఇక బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మణిపూర్, అస్సాం తొలి అయిదు పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. అయితే ధనిక రాష్ట్రాల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లేకపోవడం ఇక్కడ విశేషం. గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ, హోం మంత్రిగా అమిత్ షా కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతటి హేమా హేమీ ఇలాంటి నాయకులు ఉన్నప్పటికీ.. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని చెప్పిన గుజరాత్ రాష్ట్రం ధనిక రాష్ట్రాల జాబితాలో లేకపోవడం విశేషం. కేంద్రం నివేదిక ప్రకటించడమే ఆలస్యం భారత రాష్ట్ర సమితి ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టింది. చూశారా తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ధనిక రాష్ట్రం చేసాడని చెప్పడం ప్రారంభించింది. ఇక భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగంలో అయితే ప్రచారం మామూలుగా లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. నిన్నటిదాకా మా పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని ఆరోపించారు. ఇప్పుడేమో కేంద్రమే ధనిక రాష్ట్రమని ప్రకటించింది. ఇంతకంటే రుజువేం కావాలి.. మా పరిపాలన వల్లే తెలంగాణ రాష్ట్రానికి ఆ ఘనత వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రం కూడా ధనిక రాష్ట్రంగా పేరు తెచ్చుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు.