Rains : తెలంగాణకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. రాబోయే మూడు రోజులు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే వారం రోజులుగా వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. ఇప్పటికీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో.. నేడు(శనివారం) భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆగస్టు 30, 31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లా వర్షాలు వదలతో తీవ్రంగా నష్టం జరిగింది. ఇప్పుడిపుపడే వరదలు తగ్గాయి. ఈ క్రమలో ఐఎండీ మళ్లీ హెచ్చరిక జారీ చేయడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారియి. పంటలు ఎదుగుతున్నాయి. ఈ సమయంలో మళ్లీ భారీ వర్షాలుక ఉరిస్తే ఎలాంటి ఉపద్రవం వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
ఉరుములు, మెరుపులు..
వచ్చే మూడు రోజులు వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో.. పూర్తిస్థాయి అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధ ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఇంకా ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశకు వంగి ఉందని వెల్లడించారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఆదివారం వాయుగుండంగా మారే చాన్స్ ఉందని పేర్కొంది. తరువాత ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ వచ్చే మూడు రోజులలో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆ జిల్లాలకు చెడ్ అలర్ట్..
ఈ నెల 9న మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపింది. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రభుత్వం అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది.