IBomma Ravi: పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా వరకు నష్టాన్ని ఎదుర్కొంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల నుంచి పైరసీని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది కార్య రూపమైతే దాల్చలేదు. దాంతో సినిమా రిలీజ్ రోజే వివిధ సైట్లలో పైరసీ ప్రింట్లు రావడం ప్రతి ఒక్కరిని కలవరానికి గురిచేశాయి. మొత్తానికైతే ప్రొడ్యూసర్స్ దీని వల్ల భారీగా నష్టపోతున్నామనే విషయం తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అండ్ టీం ఒక ఆపరేషన్ ద్వారా ఐ బొమ్మ అనే సైట్ నడిపిస్తున్న రవిని పట్టుకున్నారు. తనని తొమ్మిది రోజులపాటు కష్టడిలో ఉంచి విచారించినట్టుగా సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలియజేశారు.
రీసెంట్ గా అతనికి పోలీస్ శాఖలో జాబ్ ఇస్తున్నట్టుగా కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అవన్నీ అబద్ధమని అతనికి ఎలాంటి జాబ్ ని మేము ఆఫర్ చేయలేదని డిసిపి తెలియజేయడం విశేషం…ఈ విచారణలో పైరసీ సినిమాల గురించి చాలా వివరాలను తెలియజేశాడట, కానీ కొన్ని లావాదేవీల విషయంలో మాత్రం ఆయన నోరు మెదపడం లేదంటూ డీసీపీ క్లారిటీ ఇచ్చారు.
ఇక తను తప్పు చేశాను అనే ఫీలింగ్ అతనికి ఏ కోశానా లేదు. తను ఇలాంటి పని చేసినందుకు రిగ్రేట్ అవ్వడం లేదు. ఆయన చేసింది సరైన పనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అంటూ డీసీపీ తెలియజేశాడు… ఇక ఇదిలా ఉంటే ఐ బొమ్మ రవికి జనం నుంచి భారీ స్పందన వచ్చింది. తను ఒక రాబిన్ హుడ్ అంటూ చాలామంది తెలియజేయడం విశేషం… సినిమా బడ్జెట్ పెరిగిపోయి, టిక్కెట్ల రేట్లు పెంచడం వల్ల సామాన్య మానవులు థియేటర్ కి వచ్చి సినిమాలు చూసే పరిస్థితి లేదు.
దానివల్లే అతడు అలాంటి వైఖరిని పాటించి మొత్తానికైతే సామాన్యుడికి సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు అంటూ చాలామంది అతనికి సపోర్టుగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది మాత్రం ఐ బొమ్మ రవిని ఉద్దేశించి క్రైమ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు…కాబట్టి దానికి న్యాయపరమైన శిక్షను అనుభవించాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు…