HomeతెలంగాణHydra Effect In Hyderabad: హైడ్రా ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ చెరువు వీడియోనే నిదర్శనం

Hydra Effect In Hyderabad: హైడ్రా ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ చెరువు వీడియోనే నిదర్శనం

Hydra Effect In Hyderabad: హైడ్రా… తెలంగాణలో అందరికీ సుపరిచిత సంస్థ. ముఖ్యంగా హైదరాబాదీలకు బాగా తెలుసు. నగరంలో ఆక్రమణల తొలగింపు, విపత్తు సమయాల్లో సహాయం అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఈ హైడ్రా ఏర్పాటు చేశారు. సంస్థ ఏర్పాటు చేసి రెండేళ్లు కావొస్తున్నా.. దీనిపై ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. కానీ, దీని ఫలాలు ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌ వాసులకు అందుతున్నాయి. చెరువులకు పునరుజ్జీవం వస్తోంది.

ఆక్రమణలపై ఉక్కుపాదం..
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో ఆక్రమణలకు గురైన భూభాగాలు, సహజ వనరులను తిరిగి ప్రభుత్వ అధికార పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రారంభమైన ఈ ప్రయత్నం ఇప్పుడు స్పష్టమైన ఫలితాలను ఇస్తోంది. హైడ్రా బృందం ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూములు, చెరువుల ప్రాంతాలు తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఈ చర్యలలో భాగంగా కూకట్‌పల్లి పరిసరాల నల్లకుంట చెరువు పునరుద్ధరణ అత్యంత చర్చనీయాంశమైంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌..
ఇటీవల నల్లకుంట చెరువు పునరుద్ధరణ పనుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ వీడియోలో, ఏళ్లుగా ఆక్రమించబడిన చెరువు ప్రాంతం తిరిగి మునుపటి రూపానికి చేరి, శుభ్రంగా, సజీవంగా మారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 2016 నుంచి చట్టవ్యతిరేక ఆక్రమణలకు గురైన ఈ ప్రాంతం చివరికి హైడ్రా చర్యలతో జీవం పొందింది.

పునఃప్రారంభానికి సిద్ధం..
ప్రస్తుతం చెరువు పూర్తిగా పునరుద్ధరించబడింది. డిసెంబర్‌లో అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది హైడ్రా విభాగం సమర్థతకు ప్రతీకగా నిలుస్తుంది. అలాగే నగరంలో పర్యావరణ సమతుల్యాన్ని తిరిగి తీసుకురావడంలో కీలక వ్యవహారం అవుతోంది.

హైడ్రాపై మొదట చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ క్రమంగా అందరిలో మార్పు వస్తోంది. కానీ విపక్షాలు మారడం లేదు. ఇప్పటికీ హైడ్రాను తప్పు పడుతున్నారు. హైడ్రా కేవలం ఆక్రమణలదారుల జోలికే వెళ్తోంది. అయితే కొంతమంది ఆమ్రకణదారులు చట్‌ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీఎం సోదరుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా టచ్‌ చేయడం లేదు. ఏది ఏమైనా హైడ్రా ఫలాలు ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌ వాసులకు అందుతున్నాయి. నల్లకుంట చెరువు పునరుద్ధరణ ఈ దిశలో ప్రేరణాత్మక దశగా నిలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version