Hyderabad (3)
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులు ఎక్కువ. తెలంగాణ(Telangana)లో విపరీతంగా మాంసం తింటారు. ఇదే ఇప్పుడు మాంసం వ్యాపారులకు వరంగా మారింది. కోసిన తర్వాత మిగిలిన మాంసం నిల్వ చేసి ఫ్రెస్(Fresh) మాంసంగా విక్రయిస్తున్నారు. ఇక్కడ ఓ వ్యాపారి అయితే తక్కువ ధరకు అని కుళ్లిన మాంసం అంటగడుతున్నాడు.
హైదరాబాద్‌లో తక్కువ ధరకు మేక, గొర్రె మాంసం అంటూ కొన్ని హోటళ్లు(Hottel)ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వ చేసి, వండి కస్టమర్లకు వడ్డిస్తున్న విషయం ఫుడ్ సేఫ్టీ, జీహెచ్‌ఎంసీ అధికారుల దాడుల్లో బయటపడింది. డబీర్‌పురలోని మాతాకీ కిడ్కీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్, జీహెచ్‌ఎంసీ బృందాలు తనిఖీలు చేసి, 24 ఏళ్ల మహమ్మద్ మిస్బాహుద్దీన్‌ను అరెస్టు చేశాయి. అతను 2 క్వింటాళ్ల పాడైన మాంసాన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి, తక్కువ ధరకు వివాహ కార్యక్రమాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. మేక, గొర్రెల తలలు, కాళ్లు, బోటీ, లివర్ వంటివి కూడా ఈ మాంసంలో ఉన్నాయి. పోలీసులు ఈ మాంసాన్ని సీజ్ చేశారు.
Also Read: రోడ్డు లేదని పిల్లను ఇవ్వడం లేదట.. హరీశ్‌రావు, వెంకటరెడ్డి చర్చ
గోషామహల్‌లో..
రెండు రోజుల క్రితం గోషామహల్(Goshamahal)లో 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసాన్ని వారాల తరబడి నిల్వ చేసి, బల్క్‌గా తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఓల్డ్ సిటీ(Old City)ప్రాంతంలో ఈ దందా ఎక్కువగా నడుస్తోందని గుర్తించిన అధికారులు దాడులను ముమ్మరం చేశారు. మంగళ్‌హాట్(Mangal hut)లో ఓ వ్యాపారి వద్ద రూ.8 లక్షల విలువైన 12 టన్నుల మాంసాన్ని పోలీసులు సీజ్ చేసి, అతడిని అరెస్టు చేశారు. నిందితుడిపై కేసు నమోదై, మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారు.
కొండాపూర్‌లో హోటళ్లపై దాడి..
మార్చి 21న ఉదయం కొండాపూర్(Kondapur)లోని కాకినాడ సుబ్బయ్యగారి హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ బృందం దాడి చేసింది. కిచెన్ అపరిశుభ్రంగా, డ్రైనేజీ నీరు పొంగుతూ ఉండటం గుర్తించారు. చెడిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన వస్తువులను ఉపయోగిస్తున్నట్లు తేలింది. సిబ్బంది హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ క్యాప్స్ ధరించకపోవడం, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ప్రదర్శించకపోవడం కూడా అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. అధికారులు హోటళ్లు, మాంసం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఆహారం తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Hyderabad restaurant food safety issues
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com