Hyderabad Metro : హైదరాబాద్ వాసులకు మెట్రో రైళ్లు ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గంగా మారాయి. మెట్రో ప్రారంభమయ్యాక వాటిలో ప్రయాణించే వారిసంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల్లోనే వేల మంది నిత్యం ఈ రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీనిని ఎల్‌అండ్ టీ సంస్థ నిర్వహిస్తోంది. పలుమార్లు చార్జీలను కూడా పెంచింది. అయినా నష్టాలే వస్తున్నాయంటోంది. ఇదిలా ఉంటే.. మెట్రో నిర్వహణ సంస్థ పొరపాటుతో ఐదేళ్ల క్రితం ఒకసారి రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. తాజాగా మరోమారు అదే రిపీట్ అయింది.
లక్డీకాపూల్ స్టేషన్‌లో..
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శుక్రవారం(జనవరి 10న) ఉదయం నుంచే మెట్రో రైళ్లలో రద్దీ కనిపించింది. మరోవైపు సంక్రాంతి సెలవులకు ముందు చివరి వర్కింగ్‌డే కావడంతో చాలా మంది ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతన్నారు. ఈ క్రమంలో మెట్రో కూడా తగన ఏర్పాట్లు చేసింది. అయితే చిన్న తప్పిదం కారణంగా లక్డీకాపూల్(Lakdipool)లోని రైల్వే స్టేషన్‌లో ఒకే ట్రాక్‌పైకి రెండు మెట్రో రైళ్లు వచ్చాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపరి పీల్చుకున్నారు. లేదంటే పండుగ పూట ఘోర విషాద వార్త వినాల్సి వచ్చేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఈ తప్పిదంపై మెట్రో నిర్వహణ సంస్థ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.
దగ్గరకు వచ్చాక గుర్తింపు..
తాజాగా రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై కనిపించేంత తగ్గరకు వచ్చాయి. మెట్రో స్పీడ్ చాలా ఎక్కువ. డ్రైవర్(Driver) అప్రమత్తం కాకపోయి ఉంటే లక్డీకాపూల్ స్టేషన్‌లో ఘోరం జరిగేది. స్టేసన్‌లో ఒక రైలు ఆగి ఉండగా. మరో ట్రైన్ అదే ట్రాక్‌పై రావడంతో ప్రయాణికులు షాక్ అయ్యారు.
2019లో
గతంలో 2019లోనూ ఇలాగే జరిగింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో ట్రాక మారింది. ఒక ట్రాక్‌లో వెళ్లాల్సిన రైలు మరో ట్రాక్‌లోకి వెళ్లింది. పొరపాటును గుర్తించిన అధికారులు మరో ట్రాక్‌లో ఎలాంటి రైళ్లు రాకుండా నియంత్రించారు. దీంతో ఆరోజు పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో రైళ్లలో 400 మంది ప్రయాణికులు ఉన్నారు.