Hyderabad: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ, దసరా. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకతో బుధవారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఇక విద్యా సంస్థలకు దసరా సెలవులు కూడా బుధవారం నుంచే ప్రారంభం కానున్నాయి. బుధవారం గాంధీ జయంతి, మహాలయ అమావాస్య కూడా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది పట్టణాల నుంచి సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉంది. పండుగ నేపథ్యంలో దొంగలు కూడా చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉంది. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ తరుణంలో దసరా సెలవులు వచ్చాయి. చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లనున్న నేపథ్యంలో ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఎవరూ ఉండకుండా అందరూ ఊరెళ్తే సొమ్ములు జాగ్రత్తగా భద్రపచ్చుకోవాలని, వీలైతే వెంట తీసుకెళ్లడమే మంచిదని పేర్కొంటున్నారు. సాధారణ రోజులకన్నా సెలవల్లో ఎక్కువగా చోరీలు జరుగుతాయని సూచిస్తున్నారు. దొంగలు ఉదయం రెక్కీ నిర్వహించి.. రాత్రి చోరీలు చేస్తారని తెలిపారు. తాళం వేసి ఊరికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
ముఖ్య సూచనలు..
– దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాలనుకునేవారు విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. లేదంటే ఇంట్లోనే రహస్య ప్రదేశాల్లో దాచుకోవాలి.
– బయటకు వెళ్లినప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
– ఇళ్లకు సెంట్రల్ లాక్ సిస్టం ఉన్న తాళాలు అమర్చుకోవడం మంచింది. తాళం వేసి ఇంట్లోనివారంతా ఊరెళలితే సోలీసులకు సమాచారం ఇవ్వాలి. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళాలు వేయడం మర్చిపోవద్దు. వీలైతే చక్రాలకు కూడా లాక్ వేయడం మంచింది.
– నమ్మకమైన వాచ్‌మెన్ లేదా తెలిసిన వ్యక్తులను ఇంటికి కాపలాగా ఉంచుకోవడం మంచింది. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, వార్తా పత్రికలు, పాల ప్యాకెట్లు వేయకుండా చూసుకోవాలి.
– ఇంటి మెయిన్ డోర్‌కు తాళం వేసినా.. అది కనిపించకుండా కర్టెన్స్‌తో కవర్ చేయాలి. బయటకు వెళ్లేప్పుడు ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి ఉంచాలి.
– మీ ఇంటికి వచ్చే, వెళ్లే దారులు, ఇంటి లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచింది. వీవీఆర్ కనబడకుండా రహస్య ప్రదేశాల్లో అమర్చుకోవాలి. అల్మారా, కబోర్డ్స్‌కు తాళలాలు వేసి సీక్రెట్ ప్రదేశాల్లో ఉంచాలి.
– మీరు బయటకు వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం, స్టేటస్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు.
– కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలు నిర్వహించుకోవాలి. ఎవరిమీద అయినా అనుమానం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 94906 17100 లేదా వాట్సాప్ నంబర్ 94906 17444 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More