https://oktelugu.com/

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు?

హుజూరాబాద్ నియోజవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూలు ఖరారు కావడంతో మళ్లీ ఆ నియోజకవర్గంలో రాజకీయలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీలు మళ్లీ హుజూరాబాద్ నియోజకవర్గం పై దృష్టి సారించాయి. అక్టోబర్ 30న ఉపఎన్నిక ఉండడంతో మళ్లీ ప్రచారాన్ని గ్రామస్థాయిలో చేపట్టాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా యువనేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా బీజేపీ పార్టీ అభర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 1, 2021 / 01:33 PM IST
    Follow us on

    హుజూరాబాద్ నియోజవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూలు ఖరారు కావడంతో మళ్లీ ఆ నియోజకవర్గంలో రాజకీయలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీలు మళ్లీ హుజూరాబాద్ నియోజకవర్గం పై దృష్టి సారించాయి. అక్టోబర్ 30న ఉపఎన్నిక ఉండడంతో మళ్లీ ప్రచారాన్ని గ్రామస్థాయిలో చేపట్టాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా యువనేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా బీజేపీ పార్టీ అభర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు.

    అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆ జోరు కనిపించడం లేదు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లడంతో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.   అయితే మొన్నటి వరకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరియు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేర్లు తెరపైకి వచ్చాయి.

    వీరి పై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతోంది. ఇక తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో మరోసారి అభ్యర్థి నియామకం పై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే ఏఐసీసీ ఇన్ ఛార్జి మాణికం ఠాకుర్ తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా భేటీ అయ్యారు. కొండ పోటీకి నిరాకరించడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. తెరపైకి ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్ పేరు వచ్చింది. వెంకట్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.