https://oktelugu.com/

Telangana : తెలంగాణలో దావత్ చేసుకుంటే ఇంట్లో ఎంత వరకు మద్యం ఉంచుకోవచ్చు.? ఎక్కువైతే ఏం చేయాలి?

ఎక్కువ మద్యం వినియోగించినప్పడు ఎక్సైజ్ నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దావత్ చేసుకుంటే ఎక్సైజ్ నుంచి అనుమతి తీసుకోవాలా? అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. ఈనేపథ్యంలో అసలు దావత్ చేసుకుంటే ఎంత మద్యం వరకు వినియోగించవచ్చు. అంతకు మించితే పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి? అనే వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 / 08:15 PM IST

    Telangana

    Follow us on

    Telangana :  తెలంగాణలో లిక్కర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. మిగతా రాష్ట్రాల్లో కంటే ఇక్కడ మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. సరదా కోసమే కాకుండా పార్టీలు, ఫంక్షన్ల అల్కహాల్ ను కచ్చితంగా వినియోగిస్తారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ బావమరిది ఇంటిపై పోలీసులు రైడ్ చేసి మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. ఇక్కడ రేవ్ పార్టీ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా.. కేటీఆర్ మాత్రం ఇంట్లో ఫంక్షనలో భాగంగా లిక్కర్ వాడామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంత్లో దావత్ చేసుకున్నా.. పరిమిత సంఖ్యలో మద్యం ఉండాలని, కానీ ఎక్కువ మద్యం వినియోగించారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ మద్యం వినియోగించినప్పడు ఎక్సైజ్ నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దావత్ చేసుకుంటే ఎక్సైజ్ నుంచి అనుమతి తీసుకోవాలా? అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. ఈనేపథ్యంలో అసలు దావత్ చేసుకుంటే ఎంత మద్యం వరకు వినియోగించవచ్చు. అంతకు మించితే పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి? అనే వివరాల్లోకి వెళితే..

    తెలంగాణలో జరిగే చాలా కార్యక్రమాల్లో మద్యం ఉపయోగం ఉంటుంది. ఇక్కడ మిగతా రంగాల నుంచే కాకుండా మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. పండుగల సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా ఉంటాయి. దసరా, నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాలు లక్ష్యాన్ని చేరుకుంటాయి. అయితే మద్యం వినియోగంపై కూడా పరిమితి ఉంటుందన్న విషయం కొందరికే తెలుసు. అయితే ఫంక్షన్ కోసం ఉపయోగిస్తున్నాం.. కదా.. అని చెప్పినా కుదరదు. పలు కార్యక్రమాల్లోనూ పరిమితికి మించితే ఎక్సైజ్ నుంచి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    తెలంగాణ అబ్కారీ శాఖ చట్టం 1968 ప్రకారం ఒక వ్యక్తి ఎలాంటి ఫంక్షన్లు నిర్వహించుకుంటున్నా.. 6 లీటర్ల మద్యం, 12 బీర్లను కలిగి ఉండొచ్చు. అంతకు మించితే ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్సైజ్ శాఖ నుంచి ఆన్ లైన్ ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మద్యం వినియోగిస్తున్నామని దరఖాస్తు చేసుకుంటే అందుకు సంబంధించిన చలాను వసూలు చేస్తారు. ఈ చలాను పట్టణాలు, నగరాలతో పాటు ఇతర గ్రామాల్లో నిర్వహణ ప్రకారం విభిన్నంగా ఉంటుంది.

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైనా పార్టీ నిర్వహిస్తూ 6 లీటర్ల కంటే ఎక్కువ మద్యం వినియోగించాల్సి వచ్చినప్పుడు రూ.12 వేల చలాను చెల్లించాలి. ఇదే ఫంక్షన్ 5 స్టార్ హోటళ్లలో నిర్వహిస్తే రూ.20 వేలు చెల్లించాలి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో దావత్ నిర్వహించాల్సిన వచ్చినప్పుడు 6 లీటర్లు దాటితే రూ.9 వేలు చెల్లించాలి. ఇతర ప్రాంతాల్లోని 5 స్టార్ హోటళ్లలో నిర్వహిస్తే రూ.12 వేల చెల్లించాలి. అయితే ఫంక్షన్ కు హాజరయ్యే వారి సంఖ్య పెరిగితే చలాను మొత్తం పెరుగుతుంది.

    ఓపెన్ గ్రౌండ్ లో ఏదైనా ఫంక్షన్ నిర్వహించినప్పుడు ఈ పార్టీకి వెయ్యిమంది హాజరైతే రూ.50 వేలు చెల్లించాలి. ఇలాంటి కార్యక్రమాల్లో 5 వేలకు మించి మంది హాజరైతే రూ.2.5 లక్షలు చెల్లించాలి. మొత్తంగా ఒక పార్టీలో రూ.6 లీటర్ల కంటే ఎక్కువ మద్యం వినియోగించినప్పుడు కచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది దావత్ లో కర్ణాటక మద్యంతో పాటు విదేశీ మద్యం బాటిళ్లు దొరికాయి. ఇవి పరిమితికి మించి ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.