Medaram Jatara 2024: తెలంగాణ కుభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వేళయింది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరుగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలు మూలల నుంచి మేడారానికి ఆర్టీసీ 6 వేల బస్సులను నడుపుతోంది. ఫిబ్రవరి 18 నుంచే బస్సులు మేడారం వెళ్లొస్తున్నాయి. బుధవారం నుంచి రద్దీ భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కరీంనగర్ రీజియన్ నుంచి 850 బస్సులు..
ఆర్టీసీ రాష్ట్రం నలుమూలల నుంచి మేడారానికి 6 వేల బస్సులు నడుపుతుండగా, ఒక్క కరీంనగర్ రీజియన్ నుంచే 850 బస్సులు నడుపుతోంది. ఫిబ్రవరి 18న కరీంనగర్‌లో సర్వీస్‌లను రీజినల్ మేనేజర్ సురరిత ప్రారంభించారు. ఫిబ్రవరి 25 వరకు బస్సులు నడుపుతామని తెలిపారు.
24 గంటలు సర్వీస్‌లు..
ఇక మేడారం జాతరకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నుంచి బస్సులు నడుపుతున్నారు. 24 గంటలు బస్సులు అందుబాటలలో ఉంటాయని అధికారులు తెలిపారు.
కరీంనగర్ నుంచి 153 కిలో మీటర్లు..
ఇక కరీంనగర్ నుంచి మేడారానికి 153 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హుజూరాబాద్, రేగొండ, పరకాల, భూపాలపల్లి మీదుగా బస్సులు నడుస్తున్నాయి. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నుంచి బయల్దేరే బస్సులన్నీ కరీంనగర్, హుజూరాబాద్, రేగొండ, పరకాల భూపాలపల్లి మీదుగానే వెళ్లనున్నాయి.
– పెద్దపల్లి, గోదావరిఖని, మంథని నుంచి బయల్దేరే బస్సులు మంథని, కాటారం, భూపాలపల్లి మీదుగా మేడారం చేరుకుంటాయి. భూపాలపల్లి నుంచి మేడారానికి 54 కిలోమీటర్లు ఉంటుంది. రాంపూర్, దూదేకులపల్లి, బక్కయ్యపేట, తక్కళ్లగూడెం, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి.
– రేగొండ సమీపంలో కొత్తపల్లి వద్ద, కాళేశ్వరం, మహదేవపూర్ మధ్య ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి.
– ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వేళ్లేవారు కూడా జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు రోడ్లపై ట్రాఫిక్‌కు అంరాకం కలుగకుండా పోలీసుశాఖ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసింది. వీరు వామనాల రాకపోకలను ఐదు రోజులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
– మార్గం మధ్యలో ఆర్టీసీ ప్రత్యేక బస్సు క్యాంపులు ఏర్పాటు చేసింది. తాత్కాలిక షెల్టర్లు, క్యూలైన్ల వద్ద తాగునీరు, వైద్య సహాయం వంటి ఏర్పాట్లు చేసింది.
మహిళలకు ఫ్రీ..
ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. దీంతో ఈసారి మేడారం జాతరకు మహిళలకు ఎక్కువ సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా 6 వేల బస్సులు నడుపుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. భక్తులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి దూరం, చార్జీల వివరాలు.
1. హనుమకొండ నుంచి మేడారం జాతరకు 110 కిలోమీటర్లు ఉంటుంది. పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.140 చార్జి నిర్ణయించారు.
2. కాజీపేట నుంచి మేడారానికి 110 కిలోమీటర్లు, పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.140 చార్జీ వసూలు చేస్తున్నారు.
3. వరంగల్ నుంచి మేడారానికి 110 కిలోమీటర్లు, పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.140 చార్జీ వసూలు చేస్తున్నారు.
4. జనగామ నుంచి మేడారానికి 165 కిలోమీటర్ల దూరం. పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.201 చార్జి నిర్ణయించారు.
5. హైదరాబాద్ నుంచి మేడారానికి 259 కిలోమీటర్లు. పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.310 చార్జి వసూలు చేస్తున్నారు.
6. హైదరాబాద్ పరిధిలోని మిగతా ప్రాంతాల నుంచి మేడారానికి 274 కిలోమీటర్లు ఉంది. పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.320 చార్జి నిర్ణయించారు.
7. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి మేడారానికి 140 కిలోమీటర్లు, పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.180 చార్జి
8. నర్సంపేట నుంచి మేడారానికి 107 కిలోమీటర్లు. పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150 చార్జి నిర్ణయించారు.
9. కొత్తగూడ నుంచి మేడారానికి 137 కిలోమీటర్లు, పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.170 టికెట్ ధర నిర్ణయించారు.
10. పరకాల నుంచి మేడారం జాతరకు 107 కిలోమీటర్లు. పెద్దలకు రూ.250, పిల్లకు రూ.140 చార్జి నిర్ణయించారు.
11. చిట్యాల నుంచి మేడారానికి 115 కిలోమీటర్లు. పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.149 టికెట్ ధర నిర్ణయించారు.
12. మహబూబాబాద్ నుంచి మేడారం జాతరకు 155 కిలోమీటర్లు. పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.190 చార్జి ఉంది.
13. గూడూరు నుంచి మేడారం జాతర 125 కిలోమీటర్లు.. పెద్దల రూ.280 , చిన్నారుల రూ.160 వసూలు చేస్తున్నారు.
14. తొర్రూరు నుంచి మేడారం జాతరకు 165 కిలోమీటర్లు. పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.190 చార్జి నిర్ణయించారు.
15. వర్ధన్నపేట నుంచి మేడారం జాతర 133 కిలోమీటర్లు.. పెద్దల చార్జి రూ.300, చిన్నారుల చార్జి రూ.160గా నిర్ణయించారు.
16. ఆత్మకూరు నుంచి మేడారం జాతర 90 కిలోమీటర్లు.. పెద్దలకు రూ.210, పిల్లలకు రూ.120 టికెట్ ధర నిర్ణయించారు.
17. మల్లంపల్లి నుంచి మేడారానికి 75 కిలోమీటర్లు. పెద్దలకు రూ.180, పిల్లలకు రూ.110 చార్జి వసూలు చేస్తున్నారు.
18. ములుగు నుంచి మేడారం జాతర 60 కిలోమీటర్లు.. పెద్దల రూ.150, చిన్నారుల రూ.90 టికెట్ చార్జీ.
19. భూపాలపల్లి నుంచి మేడారం జాతర 100 కిలోమీటర్లు.. పెద్దలకు రూ.220, చిన్నారులకు రూ.130
20. ములుగు గణపురం నుంచి మేడారం జాతర 80 కిలోమీటర్లు.. పెద్దల టికెట్ రూ.200, పిల్లల టికెట్ రూ.110.
21. జంగాలపల్లి నుంచి మేడారం జాతర వరకు 55 కిలోమీటర్లు.. పెద్దల చార్జి రూ.150, పిల్లల చార్జి రూ.90.
22. పస్రా నుంచి మేడారం జాతర 30 కిలోమీటర్లు. ఫుల్ టికెట్ రూ.80, ఆఫ్ టికెట్ రూ.50.
23. గోవిందరావుపేట నుంచి మేడారం జాతర 35 కిలోమీటర్లు.. పెద్దలు రూ.100, పిల్లలకు రూ.60 వసూలు చేస్తున్నారు.
24. తాడ్వాయి నుంచి మేడారం జాతర 16 కిలోమీటర్లు.. పెద్దల చార్జి రూ.60, పిల్లల టికెట్ ధర రూ.40.