ABN – Maha News : పచ్చ మీడియా వికటట్టహాసానికి చెక్ పడింది. ఏకంగా న్యాయస్థానాలనే ఎదురించేలా సాగుతున్న న్యాయమూర్తుల వ్యక్తిత్వ హననంపై కోర్టు స్పందించింది. న్యాయవ్యవస్థనే సవాల్ చేసేలా సాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానెల్ ప్రసారాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ దుర్మార్గ చర్చపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు హైకోర్టు తీర్పులు, జడ్జీలపై కామెంట్ చేసిన ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ.. చర్చలో పాల్గొన్న మాజీ జడ్జి రామకృష్ణ, కర్రి శీనుల వ్యాఖ్యలను హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. పచ్చ మీడియా విశృంఖలత్వంపై సీరియస్ అయ్యింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఊరట లభించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ ఆర్డర్ లో న్యాయమూర్తి సంచలన కామెంట్స్ చేశారు.
ఏబీఎన్, మహాటీవీ చానళ్లలో ఈనెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్ కు న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియోలను డౌన్ లోడ్ చేసి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సీజేకు అందించాలన్నారు. టీవీ చర్చల్లో చేసిన కామెంట్స్ చూసి ఆయన తీవ్రంగా కలత చెందినట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు.
కాగా ఆయా టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్న మాటలు వైరల్ అయ్యాయి.
‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్ఛకు మేం అడ్డంకి కాదు. కానీ కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. ఒక స్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని భావించాను. కానీ సుప్రీం ఆదేశాలు, పవిత్రమైన న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణ కొనసాగించాను. న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. టీవీ ఛానళ్లలో జరిగిన చర్చ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. దీనిపై చర్య తీసుకోవాలా? వద్దా? అనేది హైకోర్టు నిర్ణయిస్తుందని’ కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు ఆగ్రహంతో పచ్చమందలో వణుకు మొదలైంది. మేం అలా అనలేదంటూ మళ్లీ కవర్ చేస్తూ దీన్ని సీరియస్ అవ్వకుండా ఏబీఎన్ చానెల్ కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ హైకోర్టు మాత్రం ఈ నోరుజారిన వెంకటకృష్ణ, జడ్జి రామకృష్ణలను కటకటాల వెనక్కి పంపి ఇంకోసారి ఇలాంటి వాగుడు వాగే వారికి హెచ్చరిక పంపాలని డిసైడ్ అయ్యింది.
ఇక మహాన్యూస్ లోనూ అవినాష్ రెడ్డి విషయంలో హైకోర్టు తీర్పులను అందులోని జర్నలిస్ట్ లు ఖండించారు. తప్పు పట్టారు. ఇది మేనేజ్ చేసి వచ్చిన తీర్పు అంటూ మాట్లాడారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఏబీఎన్, మహా న్యూస్ లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది.