Harshasai : యూట్యూబర్‌కు బిగ్‌ రిలీఫ్‌.. ముందస్తు బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు!

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్‌కు నెల రోజుల తర్వాత బిగ్‌ రిలీఫ్‌ లభించింది. అతడిపై ఇప్పటికే కేసు నమోదైనా.. పోలీసులు ఇంత వరకు అరెస్టు చేయలేదు. ఇప్పుడు కోర్టు కూడా ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : October 30, 2024 9:21 pm

Harshasai

Follow us on

Harshasai : యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అవసరం తీరాక వదిలేయడం ఈ రోజుల్లో కామన్‌ అయింది. సామాన్యులు అయితే వెంటనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతారు. కొన్ని ఘటనలు పెద్దల సమక్షంలో పంచాయతీలో సెటిల్‌ అవుతాయి. అయితే సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ఇలాంటివారు ఇలాంటి ఘటనకు పాల్పడితే మీడియాలో వార్తలు అవుతాయి. మొత్తం ప్రపంచం అంతా తలకిందులు అయినట్లుగా వార్తలు ప్రసారం చేస్తాయి. జానీ మాస్టర్, హర్షసాయి విషయంలో అదే జరిగింది. అంతకు ముందు రాజ్‌ తరుణ్‌ విషయంలోనూ మీడియా ఇలగే వ్యవహరించింది. అయితే ఒక్క జానీ మాస్టర్‌ మాత్రమే అరెస్ట్‌ అయి నెలరోజులు జైల్లో ఉన్నారు. రాజ్‌తరుణ్‌ కోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకున్నారు. ఇక తాజాగా యూట్యూబర్‌ హర్షసాయికి కూడా ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తనపై పెట్టిన కేసు చెల్లదని హర్షసాయి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

కేసు ఏమిటంటే..
హర్షసాయి తన వద్ద రూ.2 కోట్లు తీసుకోవడంతోపాటు లైంగికంగా వేధించాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌ 24 కేసు నమోదు కాగా, అప్పటి నుంచి హర్షసాయి పరారలో ఉన్నాడు. తను ఎలాంటి తపుప చేయలేదని, న్యాయంగా పోరాడతానని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. అయినా ఫలితం లేదు. అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించాడు.

’మెగా’ విషయంలో విభేదాలు
గుడ్‌ మెస్సేజ్‌.. హెల్పింగ్‌ హ్యాండ్‌తరహా వీడియోలతో హర్షసాయి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్‌ ఇండియాలో పాపులారీటీ సంపాదించుకున్నాడు. తాజాగా సినిమా రంగంలో కూడా అడుగు పెట్టాడు. ఆయన హీరోగా మెగా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా దాదాపు పూర్తికావొచ్చింది. దీంతో కాపీరైట్స్‌ కోసం నటి, హర్షాసాయి మధ్య ఇద్దరి విభేదాలు వచ్చినట్లు సమాచారం. ఈ కారణంగానే నటి హర్షసాయిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. హర్షసాయితోపాటు అతని తండ్రిపైనా ఫిర్యాదు చేసింది. దీంతో వారు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు వారికి బెయిల్‌ లభిచింది.