Kamareddy Floods: కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి తీవ్రంగా ప్రభావం చూపింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. దాదాపు ఒక ఫ్లోర్ వరకూ నీరు చేరడంతోచాలా మంది ముంపు బాధితులు ఇల్లు ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పట్టణంలోని అనేక కాలనీలు నీటమునిగిపోవడంతో ప్రజల రోజువారీ జీవనం పూర్తిగా దెబ్బతింది.
హౌసింగ్ బోర్డ్, గోస్కె రాజయ్య కాలనీలు ముంపు
తీవ్ర వర్షాలతో హౌసింగ్ బోర్డ్ కాలనీ, గోస్కె రాజయ్య కాలనీలో వరద ఉద్ధృతి ఎక్కువైంది. రోడ్లు చెదిరిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక ఇళ్లు నీటిలో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షాలతో నీట మునిగిన కామారెడ్డి పట్టణం pic.twitter.com/R4jy1yS9NZ
— Santhosh Vishwakarma (@Santhoshv4Bjp) August 27, 2025
విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో నీరు చేరడంతో అనేక కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డాయి.
భారీ వర్షాలకి ఆగమైన కామారెడ్డి.! pic.twitter.com/CJlQVw762v
— Mirror TV (@MirrorTvTelugu) August 28, 2025
ప్రధాన రహదారి ధ్వంసం –రాకపోకలకు పెద్ద ఆటంకం
కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టు వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం.. డ్రోన్ విజువల్స్
నిన్న కురిసిన హేవీ రైన్స్ వల్ల కామారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం నీటమునిగింది.
రోడ్లు, కాలనీలు, పంటలు అన్నీ ఫ్లడ్ వాటర్లో మునిగిపోయాయి.#KamareddyFloods #KamareddyRains #TelanganaRains #dronevisuals pic.twitter.com/6LFp17ID6Y
— s5news (@s5newsoffical) August 28, 2025
-రక్షణ చర్యల్లో అధికారులు
స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ వర్షం ఆగకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
– ప్రజల్లో ఆందోళన.. భయభ్రాంతులు
ప్రస్తుతం కామారెడ్డి పట్టణ దృశ్యం ప్రకృతి విపత్తును తలపిస్తోంది. ఎటు చూసినా నీటమయంగా మారిన పట్టణం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.