Diet: ఈరోజుల్లో సరైన ఆహరం తినడమే అసలైన వ్యాయామం. వాతావరణం కలుషితం.. కల్తీ ఆహారంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీంతో ఈ ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. కొంత మంది ఎన్నిరకాల వ్యాయామాలు చేసినా.. ఆరోగ్యంగా ఉండడం లేదు. కానీ క్రమబద్ధకంగా ఆహారం తీసుకుంటే ఎలాంటి వ్యాయామం అవసరం లేదని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏ వయసు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే సందేహం చాలా మందికి వస్తోంది.ఈ నేపథ్యంలో National Inistitute Of Nutrition(NIN), World Heath Organisation(WHO)సంస్థలు కలిసి శారీరక స్థితిని భట్టి ఆహారాన్ని తీసుకోవాలని తెలిపింది. ఈ సందర్భంగా కొన్ని సిఫారసులను ఓ నివేదికలో పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితె…
Also Read: విశాఖలో పవన్ పెద్ద గేమ్ ప్లాన్!
ఉదయం లేవగానే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటారు. అయితే చిన్న పిల్లలకు పాలు తాగాలని ఉంటుంది. పెద్ద వారికి ఇడ్లీ లేదా ఇతర ఆహార పదార్థాలు తీసుకోవాలని ఉంటుంది. వృద్ధులకు లైట్ ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది. కానీ పెద్దవారు తీసుకునే ఆహారం పిల్లలు, లేదా వృద్ధులు తీసుకుంటే సమస్యలు వస్తాయి. ఈ విషయంలో ఎఐఏ నివేదికలో పేర్కొన్నప్రకారం.. మనిషి శారీరక స్థితి భట్టీ వారి ఆహార కేలరీలు అవసరం పడుతాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం ఎవరు ఎంత కేలరీలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో తెలిపింది.
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 నెలల వయసు వారు కేవలం తల్లిపాలు మాత్రమే తీసుకోవాలి. వీరు తల్లి పాలు తీసుకోవడం వల్ల మానసికంగా వృద్ధి చెందుతారు. అలాగే వారి శారీరక పెరుగుదలకు తోడ్పడుతుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్న వారు తల్లి పాలతో పాటు ఉగ్గు లేదా అనుబంధ ఆహారం ఇస్తూ ఉండాలి. దీంతో వీరిలో తెలివి పెరగడం ప్రారంభం అవుతుంది. 2 నుంచి 6 సంవత్సరాల వయసు వారు కాస్త ఆహారాన్ని పెంచాలి. 10 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎముకల అభివృద్ధి కోసం సరైన ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రోటీన్లు తీసుకుంటూ ఉండాలి. యవ్వనంలో ఉన్నవారు కావాల్సిన ఆహారం తీసుకోవడమే కాకుండా వ్యాదుల నుంచి తట్టుకోవడానికి అదనంగా కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. వృద్ధులు ఆరోగ్యంగా ఉండడానికి లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి.
అయితే యవ్వనంలో ఉన్న వారు 3 వేల కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. 50 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మహిళలు1660 నుంచి 2080 కేలరీల శక్తి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. 50 నుంచి 60 సంవత్సరాల పురుషులు 1530 నుంచి 1740 కేలరీల శక్తి కలిగిన ఆహారాన్నీ తీసుకోవాలని తెలిపింది. అలాగే గర్భిణులు 2,020 కేలరీలు.. బాలింతలు 2,245 కేలరీల శక్తి చొప్పున ఆహారాన్ని తీసుకోవాలని తెలిపింది.
ఏ వయసు వారైనా ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎన్ఐఎన్ తెలిపిన వివరాల ప్రకారం.. చిరుధాన్యాల నుంచి 45 శాతం కేలరీలు, పప్పులు, బీన్స్ నుంచి 5 శాతం కేలరీలు అందుతాయి. కూరగాయలు, పండ్ల నుంచి కూడా కేలరీలు ఎక్కువగా అందుతాయి. మాంసాహారం నుంచి 5 శాతం కేలరీలు శరీరానికి అందుతాయి. ఈ విధంగా శరీరానికి అవసరం ఉన్న కేలరీలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఆరోగ్య సంస్థలు తెలుపుతున్నాయి.