https://oktelugu.com/

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 17, 2024 / 01:18 PM IST

    Rain Alert

    Follow us on

    Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్. ఒకవైపు రాజకీయ వేడి, మరోవైపు ఎండల తీవ్రతతో సతమతమవుతున్న వారికి ఉపశమనం. చల్లటి కబురు అందించింది వాతావరణ శాఖ. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఒకవైపు ఎండలు మండుతున్నా.. అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కానీ మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించడం విశేషం.

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీకి సంబంధించి ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

    తెలంగాణలో సైతం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్,నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నల్గొండ,సూర్యపేట, భువనగిరి, వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈనెల 31 నాటికి కేరళకు నైరుతీ రుతుపవనాలు తాకనున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏడాది ముందస్తుగానే రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా పడతాయని అంచనాలు ఉన్న నేపథ్యంలో.. రైతుల్లో జోష్ నెలకొంది.