Allu Arjun : అల్లు అర్జున్ వ్యవహారంలో కోర్టు తీర్పుతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. అల్లు అర్జున్ సైతం ఈ పెద్ద కేసు నుంచి ఉపశమనం పొందారు. న్యాయపోరాటంలో ఆయన గెలిచారనే చెప్పాలి. షరతులతో కూడిన బెయిల్ రావడంతో ఆయన వాదనే సరైందని వారి అనుకూలరు అభిప్రాయపడుతున్నారు. కేవలం సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పు అనడానికి బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని కోర్టు తీర్పుతో తేటతెల్లమైంది.
తొక్కిసలాట జరగడానికి తగినంత భద్రత లేకపోవడమే కారణమని అందరికీ అర్థమవుతోంది. కానీ దానిని పక్కదారి పట్టించేలా యంత్రాంగం వైపల్యాన్ని సినిమా చూసేందుకు వచ్చిన హీరో మీదకు నెట్టిన వైనం స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎన్ హెచ్ ఆర్ సీ నుంచి తెలంగాణా హైకోర్టు వరకూ అలాంటి వ్యాఖ్యలు చేశాయి. సినిమా చూసేందుకు రావడం ప్రాధమిక హక్కు..సెలబ్రిటీ అయినంత మాత్రాన దానిని అడ్డుకోగలమా అంటూ కోర్టులు కూడా ప్రశ్నించడాన్ని బట్టి అల్లు అర్జున్ తప్పేమీ లేదని తేలుతోంది.
పైగా తను గడిచిన మూడు దశాబ్దాలుగా అనేక సినిమాలు ఆ థియేటర్ లో చూసిన అనుభవముంది. అయినప్పటికీ ఈసారి జరిగిన తమ వైఫల్యాన్ని పోలీసులు బన్నీ మీదకు బనాయించే ప్రయత్నం చేసినట్టు కోర్టుల వ్యాఖ్యానాలు చాటుతున్నాయి. ఎన్ హెచ్ ఆర్ సీ నోటీసులు చెబుతున్నాయి. తాజాగా బెయిల్ రావడంతో ఈ కేసులో అల్లు అర్జున్ ఇరికించారనే వాదనకు బలం చేకూరుతోంది. తాజా బెయిల్ తో పద్మవ్యూహం చేధించిన అభిమన్యుడిలా బయటకు బన్నీ రాగలిగారు..
అల్లు అర్జున్ కు న్యాయం జరిగిందా? లేదా? అన్న దానిపై వీడియోను కింద చూడండి..