Guvvala Balaraju Criticism: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై, ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గువ్వల బాలరాజు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కేటీఆర్‌పై తన విమర్శల జోరు ఆపని బాలరాజు, ఈసారి మరింత ఘాటుగా స్పందించారు.
“కేటీఆర్ నాకంటే పెద్దోడేమీ కాదు. విదేశాల్లో చదువుకుని ఉండొచ్చు కానీ నాకు ఉన్న రాజకీయ అనుభవం, ప్రజల మధ్య పనిచేసిన అనుభవం కేటీఆర్‌కి లేదు” అని బాలరాజు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు, ఆకలి కేకలు వినిపించడం మొదలైతే గ్రామాల్లో కేటీఆర్ అడుగుపెట్టనివ్వనని హెచ్చరించారు.
Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు
గువ్వల బాలరాజు వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు పార్టీ నేతలు ఆయన మాటలను పట్టించుకోకపోయినా, మరోవైపు రాజకీయ వర్గాల్లో ఇవి హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాలరాజు తరచూ కేటీఆర్‌పై ఈ తరహా ఘాటైన విమర్శలు చేస్తుండటంతో, ఇద్దరి మధ్య విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయి.
రాబోయే రోజుల్లో గువ్వల బాలరాజు ఈ విమర్శలతో ఏ దిశగా సాగుతారు, ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఇక కేటీఆర్ ఈ వ్యాఖ్యలకు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.
కేటీఆర్ పై గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు..
కేటీఆర్ నాకంటే పెద్దోడేమీ కాదు: బాలరాజు
విదేశాల్లో చదువుకుని ఉండొచ్చు కానీ.. నాకు ఉన్న అనుభవం కేటీఆర్ కు లేదని నేను భావిస్తున్నా
ఆకలి కేకలను వినిపించడం మొదలుపెడితే గ్రామాల్లో కేటీఆర్ ను అడుగుపెట్టనివ్వను
– బాలరాజు pic.twitter.com/KhuF7VgNyw
— BIG TV Breaking News (@bigtvtelugu) August 10, 2025