AP Telangana Tourism: వీకెండ్ వచ్చిందంటే ఏదైనా పిక్నిక్ వెళ్లాలని అనిపిస్తుంది. వీటిలో పార్క్ లు, దేవాలయాలు, జలాశయాలకు వెళ్లాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం నాడు ఇలాంటి ప్రదేశాలను సందర్శించి మనసు ప్రశాంతం చేసుకుంటారు. అయితే ఒక్కోసారి పార్క్ లోకి వెళ్లడానికి టికెట్ కోసం భారీ క్యూ కట్టాల్సి వస్తుంది. అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్లాలంటే టికెట్స్ ముందే అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆలయాల్లో టికెట్స్ ఉన్నాయో ముందే తెలుసుకొని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే పార్కు వద్దకు వెళ్లే ముందే ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే సౌకర్యంగా ఉంటుంది. మరి ఇలాంటి అవకాశం ఉందా?
ఇప్పటివరకు ఆ చాన్స్ లేదు. కానీ కొత్తగా తెలుగు రాష్ట్రాలు ఆన్లైన్ బుకింగ్ కోసం అందుబాటులోకి యాప్స్.. చాటింగ్ సౌకర్యాలను తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా meeticket యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ లో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సేవలను పొందవచ్చు. అలాగే పార్క్, టెంపుల్స్, టూరిస్ట్ ప్లేసెస్ కు సంబంధించిన టికెట్స్ ను ముందే బుక్ చేసుకొని అక్కడికి హాయిగా వెళ్ళవచ్చు. ఈ టికెట్స్ ముందే బుక్ చేసుకుంటే ఆ ప్రదేశానికి వెళ్లిన తర్వాత క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో మెట్రో రైల్ టికెట్స్, ఆర్టీసీ బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. మొబైల్ లోనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన సౌకర్యాలను పొందవచ్చు. ఈ టికెట్స్ బుక్ చేసుకుంటే ఎలాంటి సర్వీస్ ఛార్జ్ విధించారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఇక్కడి ప్రభుత్వం యాప్ ను కాకుండా 9552300009 అనే నెంబర్ ను అందుబాటులో ఉంచింది. ఈ నెంబర్ ను సేవ్ చేసుకొని వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఎలాంటి వివరాలు కావాలో రిప్లై వస్తుంది. దానిని బట్టి ఒకవేళ టెంపుల్స్ కు వెళ్లాలని అనుకుంటే ఆ టెంపుల్ సమాచారం ఇచ్చి అందుకు కావాల్సిన టికెట్స్ ను ఆన్లైన్లోనే పొందవచ్చు. ఇవి కాకుండా బస్ టికెట్స్, ఇతర సర్వీసులు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అందులో కావాల్సిన సర్వీస్ ను ఎంచుకోవచ్చు.
ఈ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొన్ని టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ సేవలను అందుబాటులో ఉంచారు. దీంతో ఏవైనా టెంపుల్స్ లేదా టూరిస్ట్ ప్లేస్ లోకి వెళ్లేవారు ముందే వీటి ద్వారా టికెట్ బుక్ చేసుకుని వెళ్తే ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా ప్రయాణాలు చేసేవారు బస్ టికెట్స్ ను కూడా బుక్ చేసుకుంటే సీట్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.