కొత్త ఆల్టో కే 10లో ఇంజిన్ విషయానికొస్తే.. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 67 బీహెచ్ పీ పవర్ తో పాటు 89 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. సిటీల్లో ఉండేవారికి ఈ గేర్ బాక్స్ సౌకర్యం అనువుగా ఉంటుంది. ఈ ఇంజిన్ మాన్యువల్ గేర్ బాక్స్ లో లీటర్ పెట్రోల్ కు 24.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఏఎంటీ గేర్ బాక్స్ పై 24.90 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అయితే ఇందులో CNG ఆప్షన్ కూడా ఉంది. ఇది 33.40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఈ మోడల్ 7 అంగుళాల టచ్ స్క్రీన్ ను కలిగి ఇన్పటైన్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంది. అలాగే ఇందులో ఆడియో, కాల్ కంట్రోల్స్ ఆప్షన్లు ఉన్నాయి. సౌండింగ్ కోసం ఫోర్ స్పీకర్స్ సిస్టమ్ తో పాటు ఫ్రంట్ విండోస్, కీలెస్ ఎంట్రీ, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ తో పనిచేస్తుంది. యూఎస్ బీ, బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేసే ఈ మోడల్ మాన్యువల్ ఏసీని కలిగి ఉంది. అలాగే సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటివి ఉన్నాయి. అన్ని సీట్లకు అలర్ట్ సీట్ బెల్డ్ హారన్ ఉంటాయి.
జీఎస్టీ తగ్గడంతో పాటు దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనిని రూ.4.23 లక్షల ఎక్స్ షోరూంతో విక్రయిస్తున్నారు. అప్ గ్రేడ్ అయిన టెక్నాలజీతో పాటు సురక్షితమైన ఫీచర్లు ఉండడంతో ఈ కారు కొనుగోలుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా చిన్న ఫ్యామిలీకి ఈ కారు తక్కువ ధరకు రానుంది. అయితే ముందు ముందు ఈ కారు సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి.