Homeటాప్ స్టోరీస్Hyderabad Journalists Job Loss: గేట్ ఔట్..రేపటినుంచి మీరు రావొద్దు..రోడ్డున పడ్డ 40 మంది జర్నలిస్టులు

Hyderabad Journalists Job Loss: గేట్ ఔట్..రేపటినుంచి మీరు రావొద్దు..రోడ్డున పడ్డ 40 మంది జర్నలిస్టులు

Hyderabad Journalists Job Loss: అయిపోయింది..అంతా అయిపోయింది. వాళ్ల జీవితం లో ఇదో పీడదినం. కాదుకాదు, యాజమాన్యం బలవంతంగా మెడపెట్టి గెంటేసిన దినం. ఇన్నాళ్లు గొడ్డుచాకిరీ చేయించుకుంది. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా చుక్కలు చూపించింది. జీవితాన్ని ఈదలాంటే జీతం ముఖ్యమని.. అందుకే యాజమాన్యం ఏం చేసినా, ఎలా చేసినా ఆ ఉద్యోగులు భరించారు. బతుకీడ్చడానికి బాధలు పడ్డారు. ఇప్పుడు వారికి జీతం లేదు. జీవితాన్ని సాగించే సత్తా లేదు. ఎందుకంటే జీతం ఇచ్చే సంస్థ బయటకు పంపించింది.

Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ముహూర్తం ఫిక్స్‌ చేసిన కవిత

అదో ఛానల్. దాని వెనుక ఉన్నది ప్రస్తుత అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడికి బావమరిది. ఆయనకు ఫార్మా వ్యాపారాలు ఉన్నాయి. గతంలో కొన్న భూములు భారీ ధర పలకడంతో ఆయన దశమారింది. కోట్లు అప్పనంగా రావడంతో చానల్ పెట్టాడు. నాది బిగ్ హార్ట్ అంటూ ఉద్యోగుల ఎదుట స్పీచ్ లు దంచాడు. అంతేకాదు, తనసంస్థలో ప్రతిరోజూ ఉద్యోగులకు అన్నం పెట్టే ఏర్పాటు కూడా చేశాడు. ఒకరకంగా దీనిని జర్నలిస్టులు కూడా స్వాగతించారు. మెనేజ్మెంట్ ను అహో ఒహో అంటూ పొగిడారు.

వాపును చూసి బలుపు అనుకున్న ఆ చానల్ యజమాని.. దారితప్పాడు. చానల్ విషయాలలో వేరే వాళ్లు తలదూర్చారు. దీంతో పరిస్థితి మారిపోయింది. బ్యాలెన్స్ షీట్ నష్టాలు చూపించడం మొదలైంది. ఫలితంగా కాస్ట్ కటింగ్ అనివార్యమైంది. దీంతో యాజమాన్యంకత్తెరకు పదును పెట్టింది. స్టఫ్ ఉన్న జర్నలిస్టులను నోటీస్ లేకుండానే సాగనంపింది.

ఒకేసారి 40 మందిపై వేటు వేసింది. వాస్తవానికి అన్ని నష్టాలుకనుక ఉంటే ఆ చానల్ ఇటీవల ఓ ప్రాంతంలో కొత్త చానల్ ను ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఫార్మాసిటీలో భారీగా సంస్థలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్టు? ఆ చానల్ యజమానికి కులానికి చెందినవారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదట. కేవలం ఎటువంటి ఫాదర్లు, గాడ్ ఫాదర్లు లేని వారినే తొలగించారట.

యాజమాన్యం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా మారింది. అసలే ఉండేది హైదరాబాద్ లో.. ఇంటికిరాయి, పాలబిల్లు, కూరగాయల బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు చాలా ఉంటాయి ఖర్చులు. ఇంతటి విపత్కరపరిస్థితిలో వారు ఎలా బతకాలి? ఏంచేయాలి? జర్నలిజంలో పరిస్థితికి జర్నలిస్టులు ఎలా కారణమవుతారు? ఈ విషయం మెనేజ్మెంట్ కు తెలియదా? తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తోందా అని ఉద్యోగాలు కోల్పయిన పాత్రికేయులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version