HomeతెలంగాణKCR Bus Yatra: కేసీఆర్‌ హ్యాండ్సప్‌.. ఆ ఐదు స్థానాలు బీజేపీకేనా..!

KCR Bus Yatra: కేసీఆర్‌ హ్యాండ్సప్‌.. ఆ ఐదు స్థానాలు బీజేపీకేనా..!

KCR Bus Yatra: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఇంకోవైపు కూతరు అరెస్ట్‌.. మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు.. ఇలా వరుస పరిణామాలతో బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికే క్యాడర్‌లో నిస్తేజం.. నైరాష్యం నెలకొంది. ఈ పరిస్థితిలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు, క్యాడర్‌లో ఉత్సాహం, ఉత్తేజం నింపడమే లక్ష్యంగా కేసీఆర్‌ ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 24 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. మే 10వ తేదీ వరకు నిర్వహించే ఈ యాత్రలో 24 రోడ్‌షోలు నిర్వహించబోతున్నారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రచార యాత్రం. కానీ, దీనిని అధికారికంగా ఆ పార్టీ ప్రకటించుకోలేని పరిస్థితి. ప్రజల సమస్యల పరిష్కార యాత్రగా పరిష్కారం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే కేసీఆర్‌ బస్సు యాత్రలో ఐదు నియోజకవర్గాలను వదిలేశారు. 12 నియోజకవర్గాల్లో మాత్రమే సాగాలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీంతో ఆ ఐదు నియోజకవర్గాలను ఎవరి కోసం వదిలేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బీజేపీ, ఎంఐఎం కోసమేనా…
కేసీఆర్‌ బస్సు యాత్రలో ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ నియోజకవర్గాలు లేవు. దీంతో ఆ నియోజకవర్గాలను కేసీఆర్‌ కావాలనే తప్పించారని తెలుస్తోంది. వాటిలో మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్‌ స్థానాలను బీజేపీకి వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించారని ప్రచారం జరుగుతోంది.

సుపారీ నిజమేనా..
కూతురు కవితను జైలు నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు కేసీఆర్‌ ఇప్పటికే బీజేపీ నుంచి సుపారీ తీసుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో పలు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపారని తెలిపారు. ఇప్పుడు రేవంత వ్యాఖ్యలను నిజం చేసేలా కేసీఆర్‌ బస్సు యాత్రను 5 నియోజకవర్గాలను మినహాయించారు. ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర లేదు. దీంతో బీజేపీ – బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న కాంగ్రెస్‌ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

సభలకు ప్లాన్‌..
ఇదిలా ఉంటే.. బస్సు యాత్ర లేని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. కానీ ఏప్రిల్‌ 24 నుంచి మే 10వ తేదీ వరకు పూర్తిగా కేసీఆర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఐదు నియోజకవర్గాల్లో సభలు లేనట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం కేటీఆర్, హరీశ్‌రావుతో రోడ్‌షోలు నిర్వహిస్తారని సమాచారం. మిగతా నాలుగు నియోజకవర్గాలను బీజేపీ కోసం వదిలేసినట్లే అని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version